Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా

ABN, Publish Date - Apr 14 , 2025 | 06:22 AM

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం నాడు తిరుమలకు చేరుకున్న అనంతరం గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో.. టీటీడీ నిబంధనలు అనుసరిస్తూ అన్నా లెజినోవా డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 1/11

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి కొణిదల అన్నా లెజినోవా ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 2/11

తిరుమలకు చేరుకున్న అనంతరం గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో అన్నా లెజినోవా డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 3/11

ఈ సందర్భంగా వరాహ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత పద్మావతి కల్యాణ కట్టలో కొణిదల అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించారు.

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 4/11

తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి అన్నా లెజినోవా మొక్కులు చెల్లించుకున్నారు.

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 5/11

సింగపూర్‌లో కొద్ది రోజుల క్రితం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రాణాలతో బయటపడ్డాడు.

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 6/11

తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారికి అన్నా లెజినోవా మొక్కుకున్నారు.

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 7/11

సింగపూర్ నుంచి పవన్ కల్యాణ్ , అన్నాలెజినోవా తమ బిడ్డను తీసుకొని శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 8/11

సుప్రభాత సమయంలో సోమవారం వేకువజామున వేంకటేశ్వర స్వామిని అన్నాలెజినోవా దర్శించుకున్నారు.

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 9/11

స్వామివారికి హారతి ఇస్తున్న అన్నా లెజినోవా

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 10/11

ఆలయంలో కొబ్బరికాయ కొడుతున్న అన్నా లెజినోవా

Anna Lejinova: తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా 11/11

స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా లెజినోవాకు వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated at - Apr 14 , 2025 | 08:06 AM