Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ABN, Publish Date - Apr 07 , 2025 | 09:58 PM
భద్రాచలం రామాలయంలో సోమవారం నాడు శ్రీ రామ మహా పట్టాభిషేకం క్రతువు జరిగింది. మిథిలా కల్యాణ మండపంలో ఈ వేడుక జరిగింది. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలకరించారు.ఉదయం 10.30 నుంచి 12.30 వరకు పట్టాభిషేక క్రతువు జరిగింది. శ్రీ రామ మహా పట్టాభిషేకంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు.

భద్రాచలం రామాలయంలో సోమవారం నాడు శ్రీ రామ మహా పట్టాభిషేకం క్రతువు జరిగింది.

శ్రీ రామ మహా పట్టాభిషేకంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు.

గవర్నర్ జష్ణు దేవ్ వర్మకు ఆలయ మర్యాదలతో అర్చకులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు.

భద్రాచలం రామాలయంలో రాష్ట్ర గవర్నర్ జష్ణు దేవ్ వర్మ స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

గవర్నర్ జష్ణు దేవ్ వర్మకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి మహా పట్టాభిషేకం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

భక్తులకు స్వామి వారి ఆయుధాన్ని చూపుతున్న బ్రాహ్మణులు

స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న గవర్నర్ జష్ణు దేవ్ వర్మ

స్వామివారికి పుష్పభిషేకం చేస్తున్న బ్రాహ్మణులు

స్వామి వారి వజ్రాభరణాలను భక్తులకు చూపిస్తున్న బ్రాహ్మణులు

స్వామివారికి గొడుగు పడుతున్న బ్రాహ్మణులు
Updated at - Apr 08 , 2025 | 07:37 AM