చేవెళ్లలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ABN, Publish Date - Apr 05 , 2025 | 07:49 AM
రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండల పరిధిలో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి , సేంద్రియ రైతు సమ్మేళనంలో శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండల పరిధిలో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి , సేంద్రియ రైతు సమ్మేళనం -2025 కార్యక్రమానికి శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు స్వాగతం పలుకుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

సమ్మేళనంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాల స్టాళ్లను సందర్శించారు. అలాగే రైతులు పండించిన పంటలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పరిశీలించారు.

స్టాళ్లను సందర్శించిన తర్వాత రైతులతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు.

సేంద్రియ సాగుతో భూసారాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రకృతిని సంరక్షించుకోవచ్చని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, రైతులు

పరిశోధనలు, పారిశ్రామికవేత్తలు, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.

గత డిసెంబర్‌లో మెదక్‌లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించానని.. ఆ సమయంలో సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నానని ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గుర్తుచేశారు.

వ్యవసాయ యంత్రాల ద్వారా ఆవిష్కరణలు విసృతంగా జరగాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆకాక్షించారు.
Updated at - Apr 05 , 2025 | 08:01 AM