170 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంత్ అంబానీ..
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:01 PM
Anant Ambani Padyatra: ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ బిడ్డ అనంత్ అంబానీ పాదయాత్ర చేశారు. మహారాష్ట్రలోని జామ్ నగర్ నుంచి గుజరాత్‌లోని ద్వారకాదీశ్ గుడి వరకు ఏకంగా 170 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

ప్రతీ మనిషికి డబ్బు ఓ అవసరం మాత్రమే. మనిషికి వచ్చే 99 శాతం కష్టాలకు డబ్బు పరిష్కారం కావచ్చు. కానీ, ఆ ఒక్క శాతం పరిష్కారం అవ్వని సమస్యల్లో.. ప్రేమ, మనస్సాంతికి సంబంధించిన విషయాలే ఉంటాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనిషి స్వచ్ఛమైన ప్రేమను, ప్రశాంతతను కొనుక్కోలేడు. అందుకే తన చేతుల్లోని విషయాల కోసం దేవుడ్ని ప్రార్థిస్తుంటాడు. ఇది ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ బిడ్డ అనంత్‌కు కూడా వర్తిస్తుంది. ఆయన ఏ విషయంలో కష్టం వచ్చిందో తెలీదు కానీ.. దైవ భక్తిని మరో స్థాయికి తీసుకెళ్లాడు. తరచుగా దేశంలోని ప్రముఖ గుళ్లకు అనంత్ వెళుతూ ఉంటాడు.
కానీ, ఈ సారి మాత్రం పాదయాత్ర చేసి మరీ గుడికి వెళ్లారు. దేవుడి దర్శనం కోసం ఏకంగా 170 కిలోమీటర్లు నడిచాడు. మహారాష్ట్రలోని జామ్ నగర్ నుంచి గుజరాత్‌లోని ద్వారకాదీశ్ గుడి వరకు పాదయాత్ర చేశారు. మార్చి 29వ తేదీన జామ్ నగర్‌లొ పాదయాత్ర మొదలైంది. పాదయాత్ర చివరి రోజు అనంత్‌తో పాటు అతడి తల్లి నీతా, భార్య రాథికా మర్చంట్‌లు కూడా నడిచి గుడికి వెళ్లారు. పాదయాత్రపై అనంత్ అంబానీ మాట్లాడుతూ.. ‘ ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే. దేవుడి పేరు మీదే యాత్ర మొదలుపెట్టి ముగించాను. నేను ద్వారకాదీశునికి కృతజ్ణతలు చెబుతున్నాను. నాతో పాటు ఈ ప్రయాణంలో పాలు పంచుకున్న వారికి కూడా కృతజ్ణతలు చెబుతున్నాను’ అని అన్నాడు.
అనంత్ భార్య రాథిక మాట్లాడుతూ.. ‘ ఈ రోజు అనంత్ 30వ పుట్టిన రోజు. మా పెళ్లి తర్వాత ఇక్కడికి పాదయాత్ర చేయాలని అనంత్ కోరుకున్నాడు. గుడి దగ్గర అనంత్ పుట్టిన రోజు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్న వారందరికీ నా కృతజ్ణతలు’అని అంది. పాదయాత్ర మొదలైనప్పటినుంచి అనంత్ హనుమాన్ చాలీసా, సుందరాకాండ, దేవీ స్తోత్రం పఠిస్తూ నడిచినట్లు తెలుస్తోంది. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికి కూడా అనంత్ అంతదూరం పాదయాత్ర చేయటంపై సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Ayodhya Surya Tilak: అయోధ్యలో కన్నుల పండువగా నవమి వేడుకలు లైవ్..
Harish Rao: ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారు