Viral Video: గ్రామంలోకి చొరబడిన చిరుత.. సడన్‌గా తోక పట్టుకున్న వ్యక్తి.. చివరకు..
ABN, Publish Date - Jan 08 , 2025 | 07:31 PM
అడవిలో ఉండాల్సిన జంతువులు కొన్నిసార్లు జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. మరికొన్నిసార్లు జనాలపై దాడులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి సందర్భంగా పులులు, సింహాల బారిన పడి పలువురు చనిపోవడం కూడా చూస్తున్నాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా నిత్యం చూస్తుంటాం. తాజాగా..
అడవిలో ఉండాల్సిన జంతువులు కొన్నిసార్లు జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. మరికొన్నిసార్లు జనాలపై దాడులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి సందర్భంగా పులులు, సింహాల బారిన పడి పలువురు చనిపోవడం కూడా చూస్తున్నాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా నిత్యం చూస్తుంటాం. తాజాగా, కర్నాటకలో చోటు చేసుకున్న విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ చిరుత పులి గ్రామంలోకి చొరబడడంతో అంతా భయంతో పరుగులు తీశారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వెనుకే వెళ్లి తోక పట్టుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని (Karnataka) తుమకూరు జిల్లా తిప్తూరు తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత పులి గ్రామంలోకి చొరబడింది. దీంతో గ్రామస్తులంతా భయంతో పరుగులు తీశారు. చిరుత కూడా వారిని వేటాడేందుకు ప్రయత్నించింది. చిరుతను బంధించాలనే ఉద్దేశంతో గ్రామస్తులంతా కలిసి ఉచ్చు కూడా వేశారు. కానీ చిరుత అందులో పడకుండా చివరకు వారి పైనే దాడి చేయబోయింది.
Viral Video: ఈజీగా చోరీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదుగా..
ఇంతలో గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి రంగంలోకి దిగాడు. ధైర్యంగా చిరుత వెనుకే పరుగెత్తి చివరకు దాని తోక పట్టుకున్నాడు. ఆ వెంటనే దాన్ని పక్కకు లాగి (Man grabs leopard by tail) గ్రామస్తులపై దాడి చేయకుండా ఆపగలిగాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది అప్రమత్తమై చివరకు చిరుతను పట్టుగోగలిగారు. ఆ తర్వాత చిరుతను సురక్షితంగా అడవిలో వదిలేశారు. అయితే ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి చిరుత బారి నుంచి గ్రామస్తులను కాపాడిన ఆనంద్‌ను అంతా ప్రశంసలతో ముంచెత్తారు.
Viral Video: కేజీఎఫ్ సినిమాను గుర్తు చేస్తున్న బైక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ వ్యక్తి నిజంగా ఎంతో గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘చిరుత బారి నుంచి గ్రామస్తులను కాపాడడం అభినందనీయం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మందుబాబులా మజాకా.. డ్రంకెన్ డ్రైవ్ చేయకుండా కారును ఎలా తీసుకెళ్లారంటే..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 08 , 2025 | 07:31 PM