Share News

Crocodile Viral Video: కుక్క పిల్లను లాక్కెళ్లిన మొసలి.. కాపాడేందుకు నీటిలోకి దూకిన వ్యక్తి.. చివరకు..

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:45 PM

చెరువులో ఆకలితో ఉన్న ఓ పిల్ల మొసలికి నీటి ఒడ్డున కుక్క పిల్ల కనిపిస్తుంది. దాన్ని చూడగానే మొసలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిపై దాడి చేస్తుంది. గమనించిన కుక్క పిల్ల యజమానికి దాని కాపాడేందకు నీటిలోకి దూకేస్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Crocodile Viral Video: కుక్క పిల్లను లాక్కెళ్లిన మొసలి.. కాపాడేందుకు నీటిలోకి దూకిన వ్యక్తి.. చివరకు..

మొసళ్ల దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నీటిలో ఉన్న మొసళ్లు ఎలాంటి జంతువునైనా ఇట్టే ప్రాణాలు తీసేస్తుంటాయి. వాటి దాడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. అయితే కొన్నిసార్లు కొన్ని జంతువులు మొసళ్ల బారి నుంచి లక్కీగా బయటపడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఆశ్చర్యకర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి కుక్క పిల్లను నోట కరుచుకుని లాక్కెళ్లింది. దాన్ని కాపాడేందుకు ఓ వ్యక్తి నీటిలోకి దూకేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఫ్లోరిడాలో (Florida) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చెరువులో ఆకలితో ఉన్న ఓ పిల్ల మొసలికి నీటి ఒడ్డున కుక్క పిల్ల కనిపిస్తుంది. దాన్ని చూడగానే మొసలి ఏమాత్రం (Crocodile attack on puppy) ఆలస్యం చేయకుండా దానిపై దాడి చేస్తుంది. చటుక్కున నోట కరుచుకుని నీటిలోకి లాక్కెళ్తుంది.

Funny Mosquito Video: దోమలపై మరీ ఇంత కోపమా.. ఎలా చంపుతున్నాడో చూస్తే అవాక్కవుతారు..


కుక్క పిల్లపై మొసలి దాడి చేయడాన్ని చూసి దాని యజమాని షాక్ అవుతాడు. వెంటనే షాక్ నుంచి తేరుకుని, దాన్ని కాపాడేందుకు నీటిలోకి దూకేస్తాడు. నీటిలోకి దూకి నేరుగా మొసలి తలను పట్టుకుంటాడు. మొసలి తలను గట్టిగా పట్టుకుని నోరు తెరిచేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు మొసలి కుక్క పిల్లను మరింత గట్టిగా పట్టుకుని చంపేందుకు ప్రయత్నిస్తుంది. అయినా అతను మొసలిని వదలకుండా మరింత గట్టిగా పట్టుకుని నోటిని బలవంతంగా తెరుస్తాడు. దీంతో కుక్క పిల్ల (man saved puppy from crocodile) ప్రాణాలతో బయటపడుతుంది.

Drone Funny Video: డ్రోన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. వీళ్లు ఏం చేస్తున్నారో మీరే చూడండి..


ఇలా తన ప్రాణాలకు తెగించి, కుక్క పిల్ల పిల్ల ప్రాణాలను కాపాడిన ఈ వ్యక్తిని అంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రాణాలకు తెగించి కుక్క పిల్లను కాపాడడం గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘మూగ జీవాల పట్ల ఇతను చూపించిన ప్రేమ అమోఘం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Elephant VS Lions: సింహాలు గుంపులుగా ఉంటే.. సింగిల్‌‌గా వచ్చిన ఏనుగు.. చివరకు చూడగా..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2025 | 05:45 PM