Elephant VS Lions: సింహాలు గుంపులుగా ఉంటే.. సింగిల్‌గా వచ్చిన ఏనుగు.. చివరకు చూడగా..
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:36 PM
అడవిలో సింహాలన్నీ ఓ చోట గుంపులుగా చేరి సేదతీరుతుంటాయి. ఇలా విశ్రాంతి తీసుకునే సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద ఏనుగు ఘీంకరిస్తూ అక్కడికి వస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

‘‘పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది’’.. అనేది సినిమా డైలాగ్. ఇందుకు తగ్గట్టుగానే సింహం ఎంతో పవర్‌ఫుల్ అనే విషయం అందరికీ తెలిసిందే. అది నడుస్తూ వస్తుందంటే.. మిగతా జంతువులు పరారవుతుంటాయి. అయితే కొన్నిసార్లు సీన్ రివర్స్ అవుతుంటుంది. భయపెట్టాల్సిన సింహాలు కాస్తా.. భయంతో పరుగులు తీస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహాలు గుంపులు ఉండగా.. ఏనుగు సింగిల్‌గా అక్కడికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో సింహాలన్నీ ఓ చోట గుంపులుగా చేరి సేదతీరుతుంటాయి. ఇలా విశ్రాంతి తీసుకునే సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద ఏనుగు ఘీంకరిస్తూ అక్కడికి వస్తుంది.
Funny Mosquito Video: దోమలపై మరీ ఇంత కోపమా.. ఎలా చంపుతున్నాడో చూస్తే అవాక్కవుతారు..
ఏనుగు సమీపానికి రావడం చూసి అక్కడున్న సింహాలన్నీ భయంతో వణికిపోతాయి. ‘‘వామ్మో.. గజరాజు వస్తున్నాడు.. ఇక్కడే ఉంటే తొక్కి చంపేస్తాడు.. పదండి పారిపోదాం’’.. అని అనుకుంటూ పడుకున్న సింహాలన్నీ (Lions run away after seeing an elephant) తలో దారిలో పరుగులు తీస్తాయి. సింహాలను చూసి ఏనుగు పరుగు పరుగున సమీపానికి వచ్చి.. మరింత భయపెడుతుంది. దీంతో అక్కడున్న సింహాలన్నీ మరింత వేగంగా అక్కడి నుంచి పారిపోతాయి. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Lions VS Buffaloes: చుట్టుముట్టిన సింహాలతో గేదె పోరాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఏనుగు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహాలకు చుక్కలు చూపించిన ఏనుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా లైక్‌లు, 26 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Crocodile VS Python: పట్టుకున్న మొసలి.. చుట్టేసిన కొండచిలువ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..