Scorpion farming: తేలు విషానికి ఎందుకంత డిమాండ్..ఈ వీడియో చూస్తే అసలు మ్యాటర్ మీకే అర్థమవుతుంది..
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:36 PM
Scorpion venom farming: కోళ్లు, బాతులు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకం గురించి మీరు వినే ఉంటారు. కానీ, తేళ్ల పెంపకం గురించి ఎప్పుడైనా విన్నారా.. ఒక్క తేలు కనిపిస్తేనే ఎక్కడ కుడుతుందో అని భయంతో వణికిపోతారు. అలాంటిది వేల కొద్దీ తేళ్లను కేవలం విషం కోసమే పెంచుతున్నాడు ఈ వ్యక్తి..

Scorpion venom farming: చిన్నగా కనిపించినా తేళ్లలోని విషం ప్రాణాంతకమని అందరికీ తెలుసు. కానీ, తేళ్ల విషానికి ప్రపంచ మార్కెట్‌లో అమితమైన డిమాండ్ ఉందని మీకు తెలుసా. వినడానికి కాస్త భయంకరంగా అనిపించినా, ఈ విషం ద్వారా కొన్ని భయంకరమైన వ్యాధులకు ఔషధాలు తయారుచేస్తారు. అందుకే తేళ్ల విషం విలువ ఆకాశాన్నంటుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ద్వారా ఈ వింత పరిశ్రమ గురించి తెలుసుకుని చాలామంది ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. మరి, వేలాది తేళ్లను ఒకేచోట పెంచి.. వాటి విషాన్ని ఎలా సేకరిస్తారని మీకూ అనుమానం కలుగుతోందా..
లీటరు తేలు విషం రూ.85 కోట్లు..
తేలు విషాన్ని ముఖ్యంగా క్యాన్సర్, మల్టిపుల్ స్క్లెరోసిస్, యాంటీ ఏజింగ్ ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ విషం విలువ భారత కరెన్సీలో రూ.85 కోట్ల వరకు ఉంటోంది. ఒక లీటర్ తేలు విషం ధర దాదాపు 10 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది అతి ఖరీదైన ద్రవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు కొందరు అదేపనిగా తేళ్ల సాగు చేపడుతున్నారు. ప్రత్యేక గదుల్లో వేలాది తేళ్లను పెంచుతూ విషాన్ని సేకరిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఒక్కో తేలు నుంచి రోజుకు రెండు మిల్లీగ్రాముల విషం తయారవుతుందట. ఇలా తేళ్ల ఫార్మింగ్ ద్వారా కోట్లాదిమంది ఉపాధి పొందుతున్నారు.
ఈ కొత్త వ్యవసాయరంగ విభాగం గురించి ఈ వైరల్ వీడియో ద్వారా దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలకు తెలిసింది. తేళ్లను పథకంగా పెంచుతున్న వైనం, వాటిని నిర్వహణపైనా ఈ వీడియోలో స్పష్టంగా వివరించారు. మాస్సిమో అనే వ్యక్తి తన X ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. కొందరు ఇదెక్కడి ఫార్మింగ్ రా బాబోయ్ అని ఆశ్చర్యపోగా.. ఇదేదో బాగుందే.. ఇలాంటిది మనమూ చేద్దామని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సామాన్యంగా పశుపోషణ, వ్యవసాయమే జీవనోపాధిగా భావించే ప్రజలకు తేళ్ల పెంపకం గురించి ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. భిన్నమైన, లాభదాయకమైన వాణిజ్య మార్గమని తెలుసుకుని అబ్బురపడుతున్నారు. కాకపోతే తేలు విషాన్ని సేకరించడం సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. అయినప్పటికీ సరైన శిక్షణ, భద్రతా చర్యలతో దీనిని సురక్షితంగా నిర్వహించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు, బయోటెక్ పరిశ్రమలు ఈ విషాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి. ఈ వీడియో చూశాక భయపెట్టే తేలు కూడా లక్షల ఆదాయం తెచ్చే ప్రాణిగా మారిపోతుందని స్పష్టమవుతోంది. ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదీ అమూల్యమైనదేనని, తలచుకుంటే ఆదాయమార్గంగా ఎలా మలచుకోవచ్చో ఇదొక చక్కటి ఉదాహరణ.
Read Also: Indian Currency: దేశంలో నాణేల చరిత్ర తెలుసా మొదటి కరెన్సీ ఎప్పుడు పుట్టిందంటే..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..