Teen Outsmarts UPI Scammer: సైబర్ నేరగాళ్లను ఎలా బురిడీ కొట్టించాలో ఈ బాలికను చూసి నేర్చుకోవాలి
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:41 PM
తన తండ్రి పేరు చెప్పి డబ్బులు కొట్టేయబోయిన సైబర్ నేరగాళ్లకు ఓ బాలిక ఓ రేంజ్‌లో ఝలకిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ట్రిక్స్‌తో జనాలను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. వీళ్ల బారిన పడకుండా ఉండేందుకు అవగాహనే ఆయుధం. వార్తల్లో కనిపించే సైబర్ నేరాల గురించి చదువుతూ ఉండాలి. నేరగాళ్ల మోసాలపై అవగాహన పెంచుకోవాలి. ఓ టీనేజ్ బాలిక సరిగ్గా ఇదే చేసింది. తన తెలివితేటలతో స్కామర్ బోర్లా పడేలా చేసింది. స్కామర్‌తో జరిగిన ఫోన్ సంభాషణ తాలుకు వీడియో, ఆడియో రికార్డింగ్‌ను కూడా నెట్టింట పంచుకుంది. ఇది చూసి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు (Teen Outsmarts UPI Scammer).
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఇటీవల ఓ స్కామర్ సదరు బాలికకు ఫోన్ చేశాడు. తనని తాను బాలిక తండ్రి స్నేహితుడిగా పరి చేసుకున్నాడు. బాలిక అకౌంట్‌లో డబ్బులు జమ చేయాల్సిందిగా ఆమె తండ్రి చెప్పాడని అన్నాడు. 12 వేలు పంపిస్తానని బాలికను మభ్య పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ బాలిక తెలివిని మాత్రం సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ఇక బాలిక స్కామర్ చెప్పినదానికల్లా ఊ కొడుతూ అమాయకంగా నటించింది. డబ్బులు పంపిస్తానని స్కామర్ అంటే ఓకే కూడా చెప్పింది.
ఆ తరువాత స్కామర్ ఓ ఫేక్ మెసేజీ ఆమె మొబైల్‌కు పంపించాడు. అందులో రూ.10 బదిలీ అయినట్టు కనిపించింది. ఆ తరువాత అతడు పంపించిన మరో ఫేక్ మెసేజీలో రూ.20 వేలు వచ్చినట్టు కనిపించింది. ఇదే విషయాన్ని బాలిక ప్రస్తావించగా అతడు పొరపాటు జరిగిందని ఆమెను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. తన రూ.18 వేలు తిరిగి పంపించేయాలని అన్నాడు. అప్పటిదాకా అమాయకంగా మాట్లాడిన యువతి ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించింది. నువ్వు చెప్పిందల్లా నమ్మేయడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా అంటూ దుమ్ము దులిపి వదిలిపెట్టింది. ఆ దెబ్బకు అతడు షాకైపోయాడు. యువతి మరో మాట మాట్లాడేలోపే ఫోన్ పెట్టేశాడు.
ఈ వీడియో నెట్టింట పంచుకున్న యువతి జనాలను సైబర్ నేరాలపై అప్రమత్తం చేసింది. అవగాహనతో ఉండాలని లేకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరించింది. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లను అస్సలు నమ్మొద్దని మరీ మరీ చెప్పింది. దీంతో, ఆ బాలిక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ఇవి కూడా చదవండి:
యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై
లక్ అంటే ఇదీ.. లాటరీలో రూ.43 లక్షల.. ఆపై మరో 86 లక్షల గెలుపు
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..