ఇదోరకం మార్కెట్
ABN , Publish Date - Apr 06 , 2025 | 08:23 AM
ఏటా మార్చి చివరి శుక్రవారం నుంచి సెప్టెంబర్ చివరి శుక్రవారం వరకు ఆల్క్‌మార్ బజార్‌లోని చీజ్ మార్కెట్ కళకళలాడుతుంది. దేశం నలుమూలల నుంచి రోజూ ఎంత లేదన్నా 30 వేల కిలోల చీజ్‌ను గుండ్రటి గడ్డలుగా తీసుకొస్తారు తయారీదారులు.

రంగురంగుల తులిప్స్ కే కాదు... కమ్మనైన చీజ్‌కీ నెదర్లాండ్స్ ప్రసిద్ధి. అక్కడి ‘ఆల్క్‌మార్ చీజ్ మార్కెట్’ అతి పెద్దది, అతి ప్రాచీనమైనది కూడా. 15వ శతాబ్దం నుంచి ఈ మార్కెట్ కొనసాగుతున్నట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఏటా మార్చి చివరి శుక్రవారం నుంచి సెప్టెంబర్ చివరి శుక్రవారం వరకు ఆల్క్‌మార్ బజార్‌లోని చీజ్ మార్కెట్ కళకళలాడుతుంది. దేశం నలుమూలల నుంచి రోజూ ఎంత లేదన్నా 30 వేల కిలోల చీజ్‌ను గుండ్రటి గడ్డలుగా తీసుకొస్తారు తయారీదారులు. ఆ సమయంలో మార్కెట్ పచ్చ బంగారంలా కనిపిస్తుంది.
ఈ వార్తను కూడా చదవండి: ఈ వారమంతా వీరికి లక్కేలక్కు..
చీజ్ నాణ్యతను బట్టి స్కేలింగ్ చేసి, రిటైలర్స్‌కు విక్రయిస్తారు. ఈ వ్యాపారం ఉదయం ఏడు గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటదాకా సాగుతుంది. ఇప్పటికీ నిర్వాహకులు సంప్రదాయ దుస్తులనే ధరించడం విశేషం. నెదర్లాండ్స్‌లోని గేదెపాలలో బీటాకెరోటిన్ ఎక్కువ. అందుకే అక్కడి చీజ్‌ను ‘ఎల్లో గోల్డ్’గా పిలుస్తారు. రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆల్క్‌మార్. ఈ సీజన్‌లో మార్కెట్‌ను చూసేందుకు టూరిస్టులు కూడా క్యూ కడతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పోస్టల్ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!
కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి
మెట్రో రైల్‌పై బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ఆపండి
Read Latest Telangana News and National News