Share News

Tamanna: ప్రేమకు షరతులు ఉండవు..

ABN , Publish Date - Apr 13 , 2025 | 06:53 AM

ప్రేమకు షరతులు ఉండవు.. అంటున్నారు ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా. అలాగే.. నేను అభిమానించే, ఆరాధించే నటి శ్రీదేవి అని భారతీయ సినిమాలో ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం అని తమన్నా పేర్కొన్నారు.

Tamanna: ప్రేమకు షరతులు ఉండవు..

ఓవైపు నాయికగా, మరోవైపు ప్రత్యేక గీతాల్లో అందర్నీ ఆకట్టుకుంటోంది తమన్నా భాటియా(Tamannaah Bhatia). తన రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గెలుపోటములు చూసిన మిల్కీబ్యూటీ తాజాగా ‘ఓదెల2’లో నాగ సాధువు అవతారం ఎత్తింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలివి...

చెప్పుల్లేకుండా నడిచా...

‘ఓదెల2’లో నాగసాధువుగా కనిపిస్తా. ఆ పాత్రను అత్యంత సహజంగా, అందరూ నమ్మగలిగేలా మ్యాజికల్‌గా చూపించడం ఓ పెద్ద ఛాలెంజ్‌. ‘మిల్కీ బ్యూటీ’ అనే ట్యాగ్‌ ఉన్నంత మాత్రాన నేను శివశక్తి లాంటి పాత్రను ఎందుకు చేయకూడదు? నేను ఈ సినిమా కోసం మేకప్‌ లేకుండా నటించా. మండుటెండల్లో చెప్పుల్లేకుండా నడిచా. ఈ సినిమా దయవల్ల నాకు కాశీ చూసే భాగ్యం దక్కింది. అక్కడ అడుగుపెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది.


ఆ నమ్మకంతోనే...

రజనీకాంత్‌ ‘జైలర్‌’లో ‘వా.. నువ్వు కావాలయ్యా’ పాట సూపర్‌ హిట్‌ అయిన తర్వాత కాస్త ఒత్తిడికి గురయ్యా. మరోసారి అలాంటి పాట చేస్తే ఆ స్థాయిలో హిట్‌ అవుతుందో లేదో అని భయపడ్డా. బాలీవుడ్‌లో ‘స్త్రీ2’ సీక్వెల్‌లోని ‘ఆజ్‌ కీ రాత్‌’ పాట కోసం చిత్రబృందం నన్ను సంప్రదిస్తే అదే విషయం వాళ్లకి చెప్పా. ‘ఈ పాట కచ్చితంగా అందరినీ అలరిస్తుంద’ని దర్శకుడు ధైర్యాన్నిచ్చారు. ఆ నమ్మకంతోనే ఓకే చెప్పా. కట్‌చేస్తే... ఆ సాంగ్‌ యూట్యూబ్‌లో నెంబర్‌వన్‌గా ట్రెండ్‌ సృష్టించింది.

అందుకే ఆ దిశగా...

నేను ఎక్కువగా పక్కింటి అమ్మాయి పాత్రల్లో నటించడానికి ఇష్టపడతా. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా అది ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా, కథలో కీలకమైనదైతే చాలు. ఈమధ్య అభిమానులు ఎక్కువగా నన్ను ప్రత్యేక పాటల్లో, అతిథి పాత్రల్లో చూడటానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం నా ప్రయాణం ఆ దిశగానే సాగుతోంది.


అది నా కల...

నేను అభిమానించే, ఆరాధించే నటి శ్రీదేవి. భారతీయ సినిమాలో ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆమె బయోపిక్‌లో నటించాలనేది నా కల. ఆ అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వేచి చూస్తున్నా. దర్శకురాలిగానూ నన్ను నేను నిరూపించుకోవాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ఏదో ఒకరోజు నా సినిమాను నేనే డైరెక్ట్‌ చేసుకుంటా.

నిజంగా ప్రేమిస్తే...

ప్రేమ, రిలేషన్‌షిప్‌కు అసలైన అర్థం తెలియక చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. ప్రేమ అనేది మనసుకు సంబంధించినది. దానికి ఎలాంటి షరతులు ఉండవు. ప్రేమ నిస్వార్థమైనది. ఎదుటివ్యక్తి ఎలా ఉండాలి? ఏం చేయాలనే విషయంలో అంచనాలు ఏర్పడ్డాయంటే... అది వ్యాపారలావాదేవీతో సమానం. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే, వారి భావాలకు స్వేచ్ఛ ఇవ్వాలి. రిలేషన్‌లో ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే ఎక్కువ ఆనందంగా ఉన్నాననిపిస్తుంది.


ఆమె అభిమానం చూసి...

ఒకసారి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినప్పుడు హఠాత్తుగా ఓ మహిళ నా దగ్గరకొచ్చి నన్ను హత్తుకుంది. నా ముఖాన్ని తన చేతిపై టాటూగా వేయించుకున్నానని చూపించింది. ఒక్కక్షణం ఏమనాలో అర్థం కాలేదు. ఆమె ఎన్నో ఏళ్లుగా నన్ను కలవడానికి ప్రయత్నిస్తోందట. అనుకోకుండా నేను ఎదురుపడేసరికి ఉద్వేగంతో ఏడ్చేసింది. ఆమె చూపించిన ప్రేమకు నా కళ్లలో ఆనందభాష్పాలు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను.

book1.2.jpg

నాకు మాత్రం గుర్తింపు రాలేదు

‘బాహుబలి’ లాంటి చిత్రాల వల్ల హీరోలకే ఎక్కువ గుర్తింపు వస్తుందన్నది నా అభిప్రాయం. ‘బాహుబలి’తో ప్రభాస్‌, రానాలు గ్లోబల్‌ స్థాయిలో సక్సెస్‌ అయ్యారు. అందులో అనుష్క, రమ్యకృష్ణలకు కొంత పేరు వచ్చినా... నేను అతిథి పాత్రగానే మిగిలిపోయాను. అందుకే తగిన గుర్తింపు రాలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Rahul Raj: కారడవిలో కాలి నడక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 13 , 2025 | 06:53 AM