Share News

ముక్కు సర్జరీ కోసం ఏకంగా 9 లక్షల ఖర్చు

ABN , Publish Date - Apr 06 , 2025 | 09:22 AM

Rs 9 Lakh Nose Job: చాలా మంది హీరోయిన్లు ముక్కు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికి సెలెబ్రిటీలే కాకుండా.. సాధారణ జనం కూడా ప్లాస్టిక్ సర్జరీతో అందానికి మెరుగులు దిద్దుకోవడానికి చూస్తున్నారు.

ముక్కు సర్జరీ కోసం ఏకంగా 9 లక్షల ఖర్చు
US Influencer Rs 9 Lakh Nose Job

అమెరికా: అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఎంత అందంగా ఉన్నా కూడా.. ఇంకా కొంచెం అందంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అందుకే.. అందానికి మెరుగులు దిద్దుకోవడానికి నానా ప్రాడెక్టులు వాడేస్తుంటారు. మరికొంతమంది తమకు నచ్చని బాడీ పార్టును ప్లాస్టిక్ సర్జరీతో సరి చేయించుకుంటూ ఉంటారు. దేశంలో టాప్ హీరోయిన్లుగా ఉన్న వాళ్లలో చాలా మంది ప్లాస్టిక్ సర్జరీతో అందానికి మెరుగులు దిద్దుకున్నవారే. ముక్కు, పెదాలకు ఎక్కువగా సర్జరీ చేయించుకుంటారు. ప్లాస్టిక్ సర్జరీ ఖర్చుతో కూడుకున్న విషయం. అయినప్పటికీ సెలెబ్రిటీలు మాత్రమే కాదు.. సాధారణం జనం కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.


తాజాగా, అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన 30 ఏళ్ల డెవిన్ ఐకేన్ అనే మహిళ ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఇందు కోసం ఏకంగా 9 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఆమె ముక్కు సర్జరీ చేయించుకోవడానికి ఓ పెద్ద కారణమే ఉంది. ఆమె ముక్కు సాధారణం కంటే కొంచెం పెద్దగా ఉండేది. వంకర తిరిగి ఉండేది. దీని కారణంగా ఆమె ఎప్పుడూ అసంతృప్తికి గురవుతూ ఉండేది. పెళ్లి తర్వాత కూడా ఆ అసంతృప్తి అలాగే కొనసాగింది. చివరకు గత నవంబర్ నెలలో సర్జరీ చేయించుకుంది. సర్జరీ చేయించుకున్న కొన్ని వారాలకే .. డిసెంబర్ నెలలో భర్తతో విడాకుల కోసం అప్లై చేసింది.


మాజీ భర్తతో జీవితం గురించి డెవిన్ మాట్లాడుతూ.. ‘ నా ముక్కు పెద్దగా ఉండటంతో చాలా బాధ పడేదాన్ని. అందుకే సర్జరీ చేయించుకున్నాను. నా మాజీ భర్త గురించి చెప్పాలంటే.. పరిచయం అయిన కొన్ని నెలలకే పెళ్లి చేసుకున్నాం. ఒకరి గురించి ఒకరికి సరిగా తెలియదు. ఆయన నా ముక్కు గురించి పట్టించుకోలేదు. నాతో ప్రేమగా ఉండేవారు. కానీ, మా మధ్య వేరే విషయాల్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. అందుకే విడాకులు ఇచ్చేశాను. సర్జరీ తర్వాత నా జీవితం మారిపోయింది. ఎంతో సంతోషంగా ఉన్నాను. వేరే వ్యక్తితో డేటింగ్ కూడా చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి:

Muskan: ముస్కాన్ పేరు చెబితే చాలు.. ఆమె వెన్నులో వణుకు..

Sri Rama Navami: ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

Updated Date - Apr 06 , 2025 | 10:20 AM