Viral News: ఆఫీసులో సెలవు ఇవ్వలేదని తోటి ఉద్యోగులను ఏం చేశాడంటే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:52 PM
ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు సెలవులు కావాలని ఆఫీసులో అడిగాడు. అయితే, ఆయనకు సెలవులు ఇచ్చేందుకు నిరాకరించినందుకు దారుణానికి పాల్పడ్డాడు. తోటి ఉద్యోగులను ఏం చేశాడంటే..

సెలవులు ఇవ్వనందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి తన తోటి ఉద్యోగులను కత్తితో పొడిచిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. అమిత్ కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగి కొన్ని రోజులు సెలవు కావాలని తనపై అధికారులను అడిగాడు. అయితే, వారు సెలవు ఇచ్చేందుకు నిరాకరించారు. సెలవు ఇవ్వండి అని అతడు చాలా బతిమాలాడాడు. ఆయన ఎంతగా బతిమిలాడుకున్నప్పటికీ సెలవు ఇచ్చేందుకు ఎవ్వరూ ఒప్పుకోలేదు. దీంతో అమిత్ కుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనకు సెలవు ఇవ్వని వారిపై కక్ష పెట్టుకున్న అతడు కత్తితో వారిపై దాడి చేశాడు.
అనంతరం ఒక బ్యాగు తగిలించుకుని వెళ్లిపోతూ కనపించిన వారిపై మండిపడ్డారు. తన దగ్గరకు ఎవరైన వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. అతడి ప్రవర్తనపై తోటి ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డుపై వెళ్తున్న అతడిని కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి.
సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన గురించి పలు వివరాలు తెలిపారు. అమిత్ కుమార్ సోడెపూర్ లోని ఘోలాలో నివసిస్తున్నాడని, అతడు సాంకేతిక విద్యా విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. అమిత్ కుమార్‌కు ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.