Jugaad Video: ఈ బోరు ఇలా ఉందేంటబ్బా.. నీరు బయటకు ఎలా వస్తోందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:45 PM
కొందరు తమ తెలివితేటలతో భిన్నంగా తయారు చేసే వస్తువులు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు తమ తెలివితేటలతో భిన్నంగా తయారు చేసే వస్తువులు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
nazruddin.official1 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. సాధారణంగా మనం గ్రామాల్లో చాలా బోర్లు చూస్తూ ఉంటాం. హ్యాండ్ పంప్ (Hand Pump)ను పైకి కిందకు కొడితే, ముందు ఉన్న పంప్ నుంచి నీరు బయటకు వస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం వెరైటీగా ఉంది. బోరుకు చెందిన హ్యాండ్ పంప్ మాత్రమే బయటకు కనబడుతోంది. ఆ హ్యాండ్ పంప్‌ను కొడితే కాస్త దూరంగా ఉన్న పంప్ నుంచి నీరు బయటకు వస్తోంది. అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. బోరు సగ భాగం భూమిలోకి కూరుకుపోయింది. దీంతో నీరు వచ్చే పంప్‌నకు ఎవరో మరో పంప్ తగిలించి నీరు బయటకు వచ్చే ఏర్పాటు చేశారు.
ఈ వెరైటీ బోర్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు లక్ష మంది వీక్షించారు. మూడు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. చాలా అద్భుతంగా ఉందని ఒకరు కామెంట్ చేశారు. ఇలా తయారు చేసిన వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీది నిజంగా షార్ప్ బ్రెయిన్ అయితే.. ఈ ఫొటోలో తాబేలు ఎక్కడుందో కనుక్కోండి..
Pakistan Viral Video: వీళ్లను చూశారా? ఎంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారో.. బైక్‌ను రిక్షాలా మార్చేశారు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..