Shocking Accident Video: రోడ్డు మీద వెళ్తున్న ఆటో.. డ్రైవర్ మీదకు బెలూన్ విసిరిన కుర్రాడు.. తర్వాతేం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:01 PM
హోలీ సందర్భంగా కొందరు కుర్రాళ్లు శ్రుతి మించి చేసిన సరదా పనులు కొన్ని చోట్ల తీవ్ర ప్రమాదాలకు కారణమయ్యాయి. భారీ ప్రమాదాలు కూడా జరిగాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఓ ఆకతాయి కుర్రాడు చేసిన అల్లరి పని ఎంతో పెద్ద ప్రమాదానికి కారణమైందో అర్థమవుతోంది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ హోలీ (Holi) పండుగను ఎంతో సంతోషంగా, సంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులు చల్లుకుని సరదాగా గడిపారు. అయితే కొందరు కుర్రాళ్లు శ్రుతి మించి చేసిన సరదా పనులు కొన్ని చోట్ల తీవ్ర ప్రమాదాలకు కారణమయ్యాయి (Holi celebrations). భారీ ప్రమాదాలు కూడా జరిగాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఓ ఆకతాయి కుర్రాడు చేసిన అల్లరి పని ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైందో అర్థమవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఆకతాయిల పని పట్టాలని కామెంట్లు చేస్తున్నారు.
memes_ka_pyasa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లోని బాగ్‌పత్‌లో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం కొంతమంది పిల్లలు వీధిలో వెళుతున్న వారిపై నీటితో నిండిన బెలూన్లను (Water Baloons) విసురుతున్నారు. ఆ సమయంలో ఆ రోడ్డు గుండా ఓ ఆటో వేగంగా వెళ్తోంది. దీంతో ఓ కుర్రాడు నీటితో నిండి ఉన్న ఓ బెలూన్‌ను ఆటోలోకి (Auto) గట్టిగా విసిరాడు. ఆ బెలూన్ నేరుగా వెళ్లి ఆటో డ్రైవర్‌కు తగిలింది. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
ఆటో కింద పడిపోగానే బెలూన్‌లు విసురుతున్న కుర్రాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. 82 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం సరదా కాదు అని ఒకరు కామెంట్ చేశారు. ఆ కుర్రాడిపై మర్డర్ కేసు నమోదు చేయాలని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jugaad Video: ఈ బోరు ఇలా ఉందేంటబ్బా.. నీరు బయటకు ఎలా వస్తోందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: ఈ గదిలో స్పైడర్‌ను 10 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లు షార్ప్ అని తెలుసుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..