Share News

Groom Viral Video: వామ్మో.. ఈ వరుడేంటి ఇలా ఉన్నాడు.. వేదిక మీద అతడి ఆటిట్యూడ్ చూస్తే..

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:28 PM

పెళ్లికి సంబంధించిన ఫన్నీ, ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా పెళ్లిలో వధూవరులు సిగ్గుతో, సంతోషంతో ఉంటారు. ఒకరి పట్ల మరొకరు ప్రేమతో, మర్యాదతో వ్యవహరిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వరుడి ప్రవర్తన చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

Groom Viral Video: వామ్మో.. ఈ వరుడేంటి ఇలా ఉన్నాడు.. వేదిక మీద అతడి ఆటిట్యూడ్ చూస్తే..
Bride and Groom

ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. పెళ్లి (Wedding)కి సంబంధించిన ఫన్నీ, ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా పెళ్లిలో వధూవరులు సిగ్గుతో, సంతోషంతో ఉంటారు. ఒకరి పట్ల మరొకరు ప్రేమతో, మర్యాదతో వ్యవహరిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వరుడి (Groom) ప్రవర్తన చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. పెళ్లి వేదిక మీద అతడి తీరు చూస్తే ఆగ్రహం కలగక మానదు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


@ItsAashu అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. వేదిక మీద వధూవరులు దండలు మార్చుకుంటున్నారు. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేసింది. తర్వాత వరుడు దండ తీసుకుని చాలా నిర్లక్ష్యంగా వధువు తలపై వేసేశాడు. అప్పుడు వధువు (Bride) దండను సరిగ్గా వేసుకుంది. ఇక, ఇతర కార్యక్రమాలు జరుగుతుండగానే వరుడు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. వధువు కిందకు వంగి కాళ్లకు దండం పెడుతున్నా వరుడి తీరు అలాగే ఉంది. ఆమెను ఆశీర్వదించాల్సింది పోయి చేతులు ముడుచుకుని చూస్తుండిపోయాడు.


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. సోదరుడు ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని ఒకరు కామెంట్ చేశారు. వధువు తండ్రి అల్లుడికి కారుకు బదులుగా బైక్ ఇచ్చాడేమో అని మరొకరు పేర్కొన్నారు. వరుడికి ఆ అమ్మాయి అంటే చాలా చులకన భావంలా ఉందని ఇంకొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Shocking Accident Video: రోడ్డు మీద వెళ్తున్న ఆటో.. డ్రైవర్ మీదకు బెలూన్ విసిరిన కుర్రాడు.. తర్వాతేం జరిగిందో చూడండి..


Jugaad Video: ఈ బోరు ఇలా ఉందేంటబ్బా.. నీరు బయటకు ఎలా వస్తోందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


Optical Illusion Test: ఈ గదిలో స్పైడర్‌ను 10 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లు షార్ప్ అని తెలుసుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 16 , 2025 | 05:28 PM