Reliance: ఇల్లు సర్దుతుండగా దొరికిన పాత కాగితాలు.. ఇప్పుడు వాటి విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Mar 16 , 2025 | 07:22 PM
ఛండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇల్లు క్లీన్ చేస్తుండగా దొరికిన పాత కాగితాలు అతడికి అదృష్టాన్ని తెచ్చి పెట్టాయి. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఛండీగఢ్‌కు చెందిన రతన్ అనే వ్యక్తిని రాత్రికి రాత్రే అదృష్ట దేవత వరించింది.

అదృష్టం (Luck) ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. ముఖ్యంగా ఇల్లు సర్దుతున్నప్పుడు బయటపడే కొన్ని విలువైన వస్తువులు భవిష్యత్తునే మార్చేస్తాయి. ఛండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తికి తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది. ఇల్లు క్లీన్ చేస్తుండగా దొరికిన పాత కాగితాలు (old papers ) అతడికి అదృష్టాన్ని తెచ్చి పెట్టాయి. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఛండీగఢ్‌కు చెందిన రతన్ అనే వ్యక్తిని రాత్రికి రాత్రే అదృష్ట దేవత వరించింది (Chandigarh man finds RIL shares).
రతన్ తన ఇంటిని క్లీన్ చేస్తుండగా కొన్ని పాత పేపర్లు కనిపించాయి. అవి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు చెందిన కాగితాలు. రతన్ తండ్రి 1988లో అంటే దాదాపు 37 ఏళ్ల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ కొన్నాడు. ఆ షేర్లకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ 37 ఏళ్ల తర్వాత రతన్‌కు బీరువాలో దొరికాయి. రతన్ తండ్రి 1988లో ఒక్కో షేర్ రూ. 10 చొప్పున 30 షేర్లు కొనుగోలు చేశారు. 1988 తర్వాత రిలయన్స్ యాజమాన్యం 3 సార్లు స్టాక్ స్ప్లిట్, 2 సార్లు బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే 1988లో కొన్న 30 షేర్లు ప్రస్తుతం 960 అయినట్టు లెక్క. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కో షేర్ ధర రూ. 1246గా ఉంది.
రతన్ దగ్గర ఉన్న షేర్ల విలువ ప్రస్తుతం దాదాపు రూ.12.05 లక్షలు. రతన్ ట్వీట్‌పై చాలా మంది ట్రేడ్ అనలిస్ట్‌లు స్పందించారు. చాలా కాలంగా ఆ షేర్లను క్లెయిమ్ చేయకపోవడం వల్ల అవి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (IEPFA)కి బదిలీ అయి ఉంటాయి. అలా జరిగితే వాటిని ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా రతన్ తన డీమ్యాట్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. రతన్‌కు సహాయం చేసేందుకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జీరోదా ముందుకు వచ్చింది.
ఇవి కూడా చదవండి..
Groom Viral Video: వామ్మో.. ఈ వరుడేంటి ఇలా ఉన్నాడు.. వేదిక మీద అతడి ఆటిట్యూడ్ చూస్తే..
Jugaad Video: ఈ బోరు ఇలా ఉందేంటబ్బా.. నీరు బయటకు ఎలా వస్తోందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: ఈ గదిలో స్పైడర్‌ను 10 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లు షార్ప్ అని తెలుసుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.