నాకౌట్‌కు అర్జున్
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:39 AM
ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్ టూర్‌లో తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి నాకౌట్‌కు చేరుకొన్నాడు. మంగళవారం జరిగిన ఐదు రౌండ్లలో రెండు గేమ్‌లు...

పారిస్: ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్ టూర్‌లో తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి నాకౌట్‌కు చేరుకొన్నాడు. మంగళవారం జరిగిన ఐదు రౌండ్లలో రెండు గేమ్‌లు గెలిచిన అర్జున్.. మరో రెండు గేమ్‌లను డ్రా చేసుకొన్నాడు. 9వ రౌండ్‌లో ఇయాన్ నెపోమ్నియాచి చేతిలో మాత్రమే అర్జున్ ఓడాడు. దీంతో మొత్తం 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన అర్జున్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. టాప్-8లో నిలిచిన వారికే క్వార్టర్స్ ఆడే అవకాశం ఉంది. 9వ స్థానంలో నిలిచిన ప్రజ్ఞానంద (4 పాయింట్లు), 11వ స్థానంలో నిలిచిన వరల్డ్ చాంపియన్ గుకేష్ (3.5 పాయింట్లు) ఎలిమినేట్ అయ్యారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..