Kohli - Shama Mohamed: కోహ్లీపై షామా మొహమ్మద్ విమర్శలు.. పాత పోస్టు వైరల్
ABN , Publish Date - Mar 04 , 2025 | 09:37 AM
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలతో వార్తల్లో నిలిచిన కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ గతంలో విరాట్ కోహ్లీపై చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లావుగా ఉన్నాడంటూ కాంట్రవర్సీకి తెరలేపిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్‌కు సంబంధించిన మరో ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. కోహ్లీని కూడా ఆమె టార్గెట్ చేసిన తీరు చూసి జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కోహ్లీని విమర్శిస్తూ ఆమె చేసిన పాత పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో మారింది ( Virat Kohli - Shama Mohamed).
2018లో కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. బ్రిటన్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ నచ్చే వారు ఇండియాలో ఉండాల్సిన అసవరం లేదంటూ కోహ్లీ అప్పట్లో చేసిన కామెంట్ కాంట్రవర్సీకి దారి తీసింది. ఓ ఫ్యాన్ పెట్టిన పోస్టుకు సమాధానంగా కోహ్లీ ఈ కామెంట్స్ చేశాడు.
Rohit Sharma-Shama Mohamad: రోహిత్ లావుగా ఉంటాడు.. కాంగ్రెస్ మహిళా నేత షాకింగ్ కామెంట్
‘‘నాకు భారతీయుల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల క్రికెట్ బాగుంటుంది. ఇక కోహ్లీని అయితే జనాలు అనసవరంగా ఆకాశానికి ఎత్తేస్తుంటారు’’ అని ఓ ఫ్యాన్ పెట్టిన పోస్టును కోహ్లీ తొలుత చదివి వినిపించాడు. ‘‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. భారత్‌లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏమిటి. నీకు నేను నచ్చకపోవడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఇతర దేశాల వారు నచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం’’ అని కోహ్లీ అప్పట్లో అన్నాడు.
ప్రజలకు అడుక్కోవడం అలవాటైంది: కేంద్ర మాజీ మంత్రి
కోహ్లీ పోస్టుపై అప్పట్లో షామా చాలా ఘాటుగా స్పందించారు. ‘‘బ్రిటిషర్లు కనిపెట్టిన ఆటను కోహ్లీ ఆడుతుంటాడు. విదేశీ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తుంటాడు. పెళ్లి కూడా ఇటలీలో చేసుకున్నాడు. హెర్షెల్ గిబ్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అని కూడా చెబుతాడు. కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ అని అంటాడు. కానీ ఇతర దేశాల క్రీడాకారులను అభిమానించే వారు మాత్రం దేశాన్ని విడిచిపెట్టి పోవాలని అంటాడు’’ అని షా మా మండిపడ్డాడు.
దీనిపై జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. షామాకు భారతీయ ప్లేయర్లు ఎవరూ నచ్చరనుకుంటా అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. దేశ క్రికెట్‌కు ఎన్నో సేవలు అందించిన కోహ్లీపైనే విమర్శలా అని కొందరు విస్తుపోయారు.
మరిన్ని క్రీడా, రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి