IPL 2025 CSK: 11 క్యాచులు మిస్.. ఈ టీమ్ ఇక అస్సాంకే..
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:02 PM
Today IPL Match: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణమైన ఆటతీరుతో తమ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఇంకో కప్పు కొడతారనుకుంటే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కూడా కష్టమే అనే పరిస్థితికి చేరుకుంది సీఎస్‌కే.

క్యాచెస్ విన్ మ్యాచెస్.. ఈ నానుడి క్రికెట్‌లో బాగా వినిపిస్తూ ఉంటుంది. ఎంతటి తోపు జట్టయినా సరే, ఫీల్డింగ్ విషయంలో తొట్రుపాడు పడితే ఓటమి గ్యారెంటీ అని ఎన్నోమార్లు ప్రూవ్ అయింది. బ్యాటర్లు ఎంత అద్భుతంగా రాణించినా, బౌలర్లు ఎంత బాగా బౌలింగ్ చేసినా.. ఫీల్డింగ్ సరిగ్గా లేకపోతే ఓటములు తప్పవు. ఇప్పుడు చాంపియన్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఇలాగే ఉంది. ఐపీఎల్ నయా ఎడిషన్‌లో దుమ్మురేపుతుందని భావిస్తే.. సీఎస్‌కే వరుస పరాజయాలతో డీలాపడింది. పాయింట్స్ బేటుల్‌లో ఆ టీమ్ 9వ స్థానానికి పడిపోయింది. ఫీల్డింగ్ వైఫల్యం ఆ జట్టును దారుణంగా దెబ్బతీస్తోంది.
బ్యాగులు సర్దుకోండి
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో కలిపి 11 క్యాచ్‌లు నేలపారు చేశారు చెన్నై ఆటగాళ్లు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌తో పాటు అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచుల్లోనూ ఫీల్డింగ్ వైఫల్యం ధోని జట్టుకు పెద్ద హెడెక్‌గా మారింది. చెన్నై ఆటగాళ్లు క్యాచులు అందుకోకపోవడంతో పాటు గ్రౌండ్ ఫీల్డింగ్‌లోనూ మిస్టేక్స్ చేస్తూ భారీగా రన్స్ లీక్ చేస్తున్నారు. బెస్ట్ ఫీల్డర్ జడేజాతో పాటు రచిన్ రవీంద్ర లాంటి వారు కూడా క్యాచులు చేజారుస్తుండటం టీమ్‌కు శాపంగా మారింది. ఆల్రెడీ బ్యాటింగ్ లోపాలతో బాధపడుతున్న జట్టుకు ఇప్పుడు చెత్త ఫీల్డింగ్ ఇంకో బిగ్ వర్రీగా మారింది. ఈ పరిస్థితులను అధిగమించి చెన్నై తమ స్టైల్‌లో ఆడటం కష్టమననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఎల్లో ఆర్మీ అస్సాంకే అని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. బ్యాగులు సర్దుకోండి.. అస్సాం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ ఎగతాళి చేస్తున్నారు. మరి.. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఎలా కమ్‌బ్యాక్ ఇస్తుందో చూడాలి.
ఇవీ చదవండి:
ఒక్క ఇన్నింగ్స్‌తో 8 రికార్డులు బ్రేక్
నేను మాట్లాడితే కొట్లాట గ్యారెంటీ: రహానె
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి