MS Dhoni IPL 2025: వరుసగా 5 ఓటములు.. తప్పు ధోనీది కాదు.. వాళ్లదే
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:35 PM
Indian Premier League: ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలసి రావడం లేదు. ఆ టీమ్ ఏం చేసినా ఫ్లాప్ అవుతోంది. వరుస ఓటములు ఎల్లో ఆర్మీని రేసులో పూర్తిగా వెనక్కి నెట్టాయి. నిన్న కేకేఆర్ చేతుల్లో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది ధోని సేన.

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈసారి ఏదీ కలసి రావడం లేదు. క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌లో ఆ జట్టు ఏం చేసినా బెడిసి కొడుతోంది. తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీతో కొత్త ఎడిషన్‌ను ఘనంగానే ఆరంభించినా.. ఆ తర్వాత నుంచి వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. దీనికి తోడు రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో పూర్తి సీజన్ నుంచి వైదొలిగాడు. ఇలాంటి తరుణంలో లెజెండ్ ఎంఎస్ ధోని సారథ్యంలో శుక్రవారం కేకేఆర్‌తో తలపడిన సీఎస్‌కే మరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో అంతా మాహీని విమర్శిస్తున్నారు.
మిస్టేక్స్ ఇవే..
ధోని తన అనుభవాన్ని రంగరించి జట్టుకు విజయాన్ని అందిస్తాడని అనుకుంటే అటు బ్యాటింగ్, ఇటు సారథ్యంలో ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్‌లో ఎవర్ని ఎప్పుడు పంపాలి, బౌలింగ్‌లో ఉన్న రిసోర్సెస్‌ను సరిగ్గా వినియోగించుకోవడంలో అతడు ఫెయిల్ అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పతిరానా లాంటి గన్ బౌలర్‌ను ఆడించకపోవడం బిగ్ మిస్టేక్ అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే వరుస పరాభవాలకు ధోని ఒక్కడ్నే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. దీనికి టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అందరు ఆటగాళ్ల తప్పిదాలు కారణమని చెబుతున్నారు.
తప్పెవరిది..
సీఎస్‌కే ఎక్కువగా సీనియర్ ఆటగాళ్ల మీదే భరోసా ఉంచి, చెపాక్‌లో అధిక మ్యాచులు గెలిచేలా స్క్వాడ్‌ను రెడీ చేసుకుంది. కానీ టాప్-3 బ్యాటర్లు ఫెయిల్ అవడంతో పాటు విజయ్ శంకర్, దూబె, జడేజా లాంటి భారత ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడం చెన్నైకి మైనస్‌గా మారింది. అలాగే ధోని ఎక్కువ సేపు ఆడే చాన్స్ లేకపోవడం, బౌలింగ్-ఫీల్డింగ్‌లోనూ దారుణంగా విఫలమవడం కూడా వరుస ఓటములకు కారణమని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. తమ దగ్గర ఉన్న వనరులకు తగ్గట్లు ప్లాన్స్ వేయడం, వాటిని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయడంలో ఫ్లెమింగ్ అండ్ ఇతర కోచింగ్ స్టాఫ్ ఫెయిల్ అవడం కూడా సీఎస్‌కే ఓటములకు కారణమని చెబుతున్నారు. అంతేగానీ ధోనీపై పగబట్టి అతడే రీజన్ అంటూ ట్రోల్స్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీమ్ ఓటమికి ఒక్కడ్నే టార్గెట్ చేయడం సబబు కాదని అంటున్నారు.
ఇవీ చదవండి:
బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి