CSK vs MI 2025 Rohit Duck: రోహిత్‌‌ను టార్గెట్ చేసి కొట్టారు.. స్కెచ్ వేసి మరీ..

ABN, Publish Date - Mar 23 , 2025 | 08:36 PM

CSK vs MI Live Score: ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ తన అభిమానుల్ని నిరాశపర్చాడు. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో అతడు ఫ్లాప్ అయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగాడు హిట్‌మ్యాన్.

CSK vs MI 2025 Rohit Duck: రోహిత్‌‌ను టార్గెట్ చేసి కొట్టారు.. స్కెచ్ వేసి మరీ..
Rohit Sharma

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న రోహిత్ శర్మ.. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లోనూ చెలరేగుతాడని అభిమానులు అనుకున్నారు. గత కొన్ని సీజన్లుగా క్యాష్ రిచ్ లీగ్‌లో హిట్‌మ్యాన్ బ్యాట్ అంతగా మోగట్లేదు. కాబట్టి ఈసారైనా మ్యాజిక్ చేస్తాడేమోనని ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. టీమిండియా తరఫున అదరగొడుతుండటంతో అదే ఫామ్‌ను ముంబై ఇండియన్స్ తరఫునా కంటిన్యూ చేస్తాడని ఆశించారు. కానీ తొలి మ్యాచ్‌లోనే అతడు ఫ్లాప్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 4 బంతుల్లో డకౌటై నిరాశగా వెనుదిరిగాడు. అయితే సరిగ్గా గమనిస్తే హిట్‌మ్యాన్ డిస్మిసల్ వెనుక పక్కా స్కెచ్ ఉన్నట్లు కనిపిస్తోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఇదేం కొత్త కాదు

ఇవాళ్టి మ్యాచ్‌లో రోహిత్‌ను లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. అది కూడా తొలి ఓవర్‌లోనే. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడాల్లేకుండా ఎదురొచ్చిన ప్రతి బౌలర్‌ను బాదిపారేస్తుండటాడు హిట్‌మ్యాన్. అయితే లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో అతడు కొంత తడబడుతుంటాడు. ఈ తరహా బౌలర్ల బంతులు యాంగిల్ వల్ల అతడ్ని ఇబ్బందికి గురిచేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందునా ఫ్లిక్ షాట్ ఆడి ఔటైన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మిచెల్ స్టార్క్, షాహిన్ అఫ్రిదీ, ట్రెంట్ బౌల్ట్ లాంటి లెఫ్టార్మ్ పేసర్లు ఈ తరహా బంతులతో అతడ్ని వెనక్కి పంపిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇవాళ రోహిత్‌పై అదే తరహా అస్త్రాన్ని ప్రయోగించింది సీఎస్‌కే. దీంతో యాంగిల్ అయి ప్యాడ్స్ మీదకు వచ్చిన బంతిని ఫ్లిక్ చేయబోయి మిడ్ వికెట్‌లో ఉన్న దూబేకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు రోహిత్. అలా అతడి వీక్‌నెస్ మీద కొట్టి.. పక్కా ప్లాన్ ప్రకారమే వెనక్కి పంపింది చెన్నై.


ఇవీ చదవండి:

సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్

సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్

ఎస్‌ఆర్‌హెచ్ దెబ్బకు వాళ్లపై వాళ్లే మీమ్ వేసుకున్నారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2025 | 08:39 PM