Varun Chakaravarthy: పోయిన చోటే వెతుక్కుంటున్న వరుణ్.. విధినే ఎదిరించిన యోధుడు
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:01 PM
IND vs ENG: మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పోయిన చోటే వెతుక్కుంటున్నాడు. ఓటమి ఒప్పుకోని యోధుడ్ని అని అతడు ప్రూవ్ చేసుకుంటున్నాడు. విధినే ఎదిరించి అతడు చేస్తున్న యుద్ధం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దలు అంటుంటారు. ఓడిపోయిన చోటే నిలబడి, తలబడి గెలుపు జెండా ఎగరేయాలని చెబుతుంటారు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి చాలా మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ఎన్ని అపజయాలు ఎదురైనా నిలబడి ఫైట్ చేస్తారు. అలాంటి వాళ్లే సుదీర్ఘ కాలంలో ఆటలో కొనసాగుతారు. వరుణ్ కూడా ఆ బాటలోనే నడుస్తున్నాడు. 2021లోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మిస్టరీ స్పిన్నర్ 3 ఏళ్ల పాటు కనిపించకుండా పోయాడు. టీ20 వరల్డ్ కప్-2021లో టీమిండియా ఓటమిని కారణంగా చూపుతూ అప్పట్లో వరుణ్‌ను టీమ్‌లో నుంచి తీసేశారు.
వేట మొదలు..
వరుణ్ జూనియర్ కావడం, ప్రపంచ కప్‌లో సరిగ్గా రాణించకపోవడంతో అతడిపై వేటు పడింది. దీంతో రెండేళ్ల పాటు అతడు చాలా బాధపడ్డాడు. అయితే ధైర్యంగా నిలబడి మళ్లీ వేట మొదలుపెట్టాడు. స్పిన్‌లో మరిన్ని వేరియేషన్స్ నేర్చుకున్నాడు. బంతిని ఇంకా వేగంగా వేయడం ప్రాక్టీస్ చేశాడు. అలా ఐపీఎల్‌లో సక్సెస్ అయ్యాడు. అక్కడి నుంచి గతేడాది టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అప్పటి నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా ఉపయోగించుకుంటున్నాడు.
అదే ఐసీసీ టోర్నీలో..
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 14 వికెట్లతో దుమ్మురేపాడు వరుణ్. దీంతో వన్డే సిరీస్‌లో అతడికి సర్‌ప్రైజ్ ఎంట్రీ దొరికింది. గాయంతో బాధపడుతున్న పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో వరుణ్‌ను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. బుమ్రా ఇంకా కోలుకోలేదు కాబట్టి చాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడే అవకాశాలు లేనట్లేనని వినిపిస్తోంది. అతడి స్థానంలో వరుణ్ దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతాడని సమాచారం. ఒకవేళ అదే జరిగితే అతడి కెరీర్‌లో అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్-2021తో ఎంట్రీ ఇచ్చి కనుమరుగయ్యాడు చక్రవర్తి. ఇప్పుడు అద్భుతంగా ఆడుతూ మళ్లీ ఐసీసీ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకునేలా ఉన్నాడు. ఐసీసీ టోర్నీలో పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు అదే చోట అద్భుతంగా రాణించి తన ప్లేస్‌ను పర్మినెంట్ చేసుకునేలా ఉన్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీమ్‌లో నుంచి తీసేసినా పోరాడి పైకి లేచాడని.. అతడు విధిని ఎదిరించి ఈ స్థాయికి చేరుకున్నాాడని అభిమానులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇదీ చదవండి:
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్‌కే
ముగ్గురు స్టార్లు ఔట్.. చాంపియన్స్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు
మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి