Share News

India vs Pakistan: భారత్‌-పాక్ మ్యాచ్.. గెలవాలంటే అదొక్కటే మార్గం అంటున్న షోయబ్ అక్తర్

ABN , Publish Date - Feb 20 , 2025 | 02:45 PM

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ జర్నీని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌తో కప్ ఫైట్ స్టార్ట్ చేయనుంది రోహిత్ సేన. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

India vs Pakistan: భారత్‌-పాక్ మ్యాచ్.. గెలవాలంటే అదొక్కటే మార్గం అంటున్న షోయబ్ అక్తర్
IND vs PAK

భారత్ వర్సెస్ పాకిస్థాన్.. క్రికెట్‌లో టాప్ ఫైట్స్‌లో మొదటి వరుసలో నిలిచే పోరు ఇది. ఈ చిరకాల ప్రత్యర్థులు బరిలోకి దిగి కొదమసింహాల్లా కొట్లాడుతుంటే చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న వైరికి తోడు గ్రౌండ్‌లోకి దిగితే ఆఖరి వరకు పోరాడే తీరు, ఓటమిని ఒప్పుకోని తత్వం ఈ మ్యాచులపై ఎక్కడలేని ఆసక్తిని రేపుతాయి. అలాంటిది ఐసీసీ ఈవెంట్స్‌లో తలపడితే ఎగ్జయిట్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న ఈ రెండు హేమాహేమీలు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


నో ఆప్షన్!

భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా మీద నెగ్గాలంటే దూకుడు ఒక్కటే మార్గమని.. అటాకింగ్ అప్రోచ్‌తో మెన్ ఇన్ బ్లూను కట్టిపడేయాలని తమ దేశ ఆటగాళ్లకు సూచించాడు అక్తర్. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో ఓడిన పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే భారత్‌ మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రిజ్వాన్ సేనకు పలు సూచనలు చేశాడు అక్తర్. భారత్ చాలా బలమైన జట్టు అని.. ఆ టీమ్‌ను ఓడించాలంటే అగ్రెసివ్‌గా ఆడటం తప్ప వేరే ఆప్షన్ లేదని సజెషన్ ఇచ్చాడు.


దూకుడు మంత్రమే శరణ్యం!

కివీస్‌తో మ్యాచ్‌లో మాదిరిగా నెమ్మదిగా ఆడతామంటే కుదరదని.. భారత్ మీద దూకుడు మంత్రం మాత్రమే పని చేస్తుందన్నాడు అక్తర్. పాక్ టీమ్‌లో పెద్దగా ఇంపాక్ట్ ప్లేయర్లు లేరని.. స్ట్రైక్ రేట్ కూడా స్లోగా ఉందని, ఇలాగైతే కుదరదన్నాడు. మెన్ ఇన్ బ్లూను ఓడించాలంటే అటాకింగ్ తప్ప వేరే దారే లేదన్నాడు. తొలి మ్యాచ్ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని అన్నాడు. అయితే అక్తర్ మాటలు విన్న నెటిజన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. దూకుడు మంత్రంతో భారత్‌ను ఆపరేరని అంటున్నారు. భారత్ అదే తీరులో అగ్రెసివ్‌గా ఆడుతుందని.. రెచ్చగొడితే ఊరుకునేది లేదని గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు.


ఇవీ చదవండి:

ప్లేయింగ్ 11లో వాళ్లకు చాన్స్ ఇవ్వని రోహిత్

భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు కోలుకోలేని షాక్

దిగొచ్చిన పాక్‌.. స్టేడియంలో భారత జెండా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2025 | 02:45 PM