Rohit Sharma: రోహిత్.. ఈ తప్పులు రిపీటైతే పాక్ చేతిలో షాక్ తప్పదు
ABN , Publish Date - Feb 21 , 2025 | 08:16 PM
Champions Trophy 2025: బంగ్లాదేశ్ మీద గెలుపుతో టీమిండియా ఆనందంలో ఉంది. ఇదే జోష్‌లో పాకిస్థాన్ మీద గెలవాలని అనుకుంటోంది. కానీ కొన్ని మిస్టేక్స్ టీమ్‌ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి.

చాంపియన్స్ ట్రోఫీ ఓపెనర్‌లో బంగ్లాదేశ్‌పై బంపర్ విక్టరీ కొట్టింది టీమిండియా. 6 వికెట్ల తేడాతో ఆ జట్టును చిత్తు చేసిన రోహిత్ సేన.. తదుపరి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫైట్‌కు సిద్ధమవుతోంది. దాయాదిని మట్టికరిపించి నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌ను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. బంగ్లాతో మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూలో పాజిటివ్స్‌తో పాటు కొన్ని నెగెటివ్స్ కూడా బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఫీల్డింగ్
బంగ్లాతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో స్టాండర్డ్స్‌ను అందుకోలేకపోయింది టీమిండియా. కీపర్‌గా కేఎల్ రాహుల్ సక్సెస్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రెండు స్టన్నింగ్ క్యాచులతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ కూడా మంచి క్యాచులు అందుకున్నారు. కానీ స్లిప్స్‌లో సారథి రోహిత్ సులువైన క్యాచ్‌ను వదిలేశాడు. దాంతో అక్షర్ హ్యాట్రిక్ చాన్స్ మిస్ అయింది. అప్పుడు వికెట్ పడి ఉంటే బంగ్లా 100 లోపే చాప చుట్టేసేది. కీపర్ రాహుల్ కూడా ఒక ఈజీ క్యాచ్ వదిలేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా లడ్డూ లాంటి క్యాచ్ వదిలేశాడు. ఇవన్నీ బంగ్లాకు ప్లస్‌గా మారాయి.
బ్యాటింగ్
రోహిత్ సహా పలువురు బ్యాటర్లు రాణించారు. గిల్ సెంచరీ కొట్టడమే గాక మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖరి వరకు నాటౌట్‌గా క్రీజులో నిలబడ్డాడు. రాహుల్ 41 పరుగులతో టచ్‌లోకి వచ్చాడు. అయితే మంచి స్టార్ట్ దొరికాక కోహ్లీ (22) మళ్లీ స్పిన్నర్‌కే వికెట్ సమర్పించుకున్నాడు. అయ్యర్ (15) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మ్యాచ్ ముగిస్తాడని అనుకున్న అక్షర్ పటేల్ (8) బాధ్యతను నిర్వర్తించలేకపోయాడు.
బౌలింగ్
బంగ్లాను 228 పరుగులకు కట్టడి చేసింది భారత్. తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడం మంచి విషయమే. కానీ ఒక దశలో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది బంగ్లా. ఆ టీమ్‌ను 100 లోపు చుట్టేస్తే బాగుండేది. కానీ బౌలర్లు ఆ పని చేయలేకపోయారు. పేలవ ఫీల్డింగ్ వాళ్లకు శాపంగా మారింది. మామూలుగా 11 నుంచి 40 ఓవర్ల మధ్య ఎక్కువగా వికెట్లు తీస్తూ వన్డేల్లో ఆధిపత్యం చలాయిస్తోంది టీమిండియా. అలాంటి బంగ్లాతో పోరులో ఈ ఓవర్లలో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. ఇలా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో ఉన్న తప్పులను రోహిత్ సేన సరిదిద్దుకోవాలి. ఒకవేళ కాస్త తేడా వచ్చినా, పిచ్-కండీషన్స్ మనకు నెగిటివ్‌గా మారినా పాక్‌తో తదుపరి ఫైట్‌లో రిజల్ట్ తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇవే మిస్టేక్స్ రిపీటైతే కప్పు కష్టమేనని వార్నింగ్ ఇస్తున్నారు.
ఇవీ చదవండి:
మా దెబ్బ మామూలుగా ఉండదు.. హార్దిక్ వార్నింగ్
రంజీ ట్రోఫీలో 68 ఏళ్లలో తొలిసారి
కేఎల్ రాహుల్‌కు అరుదైన అవార్డు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి