IND vs ENG: మూడో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11.. విధ్వంసక బ్యాటర్ రీఎంట్రీ
ABN, Publish Date - Jan 27 , 2025 | 03:51 PM
India Playing 11: భారత జట్టు మరో బిగ్ ఫైట్‌కు సన్నద్ధం అవుతోంది. ఇంగ్లండ్‌తో మూడో టీ20 కోసం రెడీ అవుతోంది సూర్య సేన. ఈసారి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఓ డాషింగ్ బ్యాటర్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. తొలి రెండు టీ20ల్లో విజయాలు సాధించి ఐదు మ్యాచుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరగనున్న మూడో టీ20 సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సూర్య సేన సొంతం అవుతుంది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్ కోసం మన జట్టు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. మరోమారు ఇంగ్లీష్ టీమ్‌ను ఓ పట్టు పట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్‌లో మన ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
2 మార్పులతో..
మొదటి రెండు టీ20ల్లో ఆడిన ఆటగాళ్లతోనే దాదాపుగా మూడో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగాలని చూస్తోంది భారత్. అయితే ఒకట్రెండు మార్పులు చోటు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ రాక్షసుడు రమణ్‌దీప్ సింగ్ రీఎంట్రీ ఖాయమని వినిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా సంజూ శాంసన్-అభిషేక్ శర్మ జోడీనే ఉంటారు. ఫస్ట్ డౌన్‌లో హైదరాబాదీ తిలక్ వర్మ, సెకండ్ డౌన్‌లో సారథి సూర్యకుమార్ యాదవ్ దిగుతారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బ్యాట్ పట్టి బరిలోకి దిగుతారు.
రీఎంట్రీ పక్కా!
పేస్ ఆల్‌రౌండర్‌గా రమణ్‌దీప్ సింగ్‌ను ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్లు తీయడంతో పాటు భారీ సిక్సులు బాదడంలో ఈ పంజాబ్ పుత్తర్ సిద్ధహస్తుడు. గత కొన్ని నెలలుగా అతడు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దీంతో ఈసారి అతడు ఎలా ఆడతాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రమణ్‌దీప్‌కు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ఒకవేళ పిచ్‌లో చేంజెస్ కనిపిస్తే వెటరన్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీని ఫిట్‌నెస్ బట్టి బరిలోకి దింపొచ్చు. అయితే రమణ్‌దీప్ స్పెషలిస్ట్ బ్యాటర్, మీడియం పేసర్ కావడంతో అతడ్ని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు చూసుకుంటాడు. ప్రధాన స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఆడటం ఖాయం.
భారత జట్టు (అంచనా)
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (సారథి), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రమణ్‌దీప్ సింగ్/మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇవీ చదవండి:
రోహిత్ బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు
ప్లాన్ ప్రకారమే అటాక్.. తిలక్ మామూలోడు కాదు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 27 , 2025 | 03:57 PM