Share News

KKR vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా.. ఇది కరెక్ట్ కాదు అయ్యర్

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:49 PM

IPL 2025: క్రికెట్‌లో గెలుపోటములు సహజం. కానీ కొందరు ఒక్క విజయానికే విర్రవీగుతుంటారు. కేకేఆర్ వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ బిహేవియర్ ఇప్పుడు ఇలాగే ఉంది. ఎస్‌ఆర్‌‌హెచ్‌పై అతడు చేసిన వ్యాఖ్యలు.. కొత్త వివాదానికి దారితీస్తున్నాయి.

KKR vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా.. ఇది కరెక్ట్ కాదు అయ్యర్
KKR vs SRH

ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏదీ కలసి రావడం లేదు. వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది కమిన్స్ సేన. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 80 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది ఆరెంజ్ ఆర్మీ. దీంతో ఒక్కసారిగా పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానానికి పడిపోయింది. ఇదే అదనుగా ఎస్‌ఆర్‌హెచ్‌పై విమర్శలు ఊపందుకున్నాయి. 300 కొడతాం అన్నారు.. 120కే పరిమితమయ్యారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కేకేఆర్ వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ కూడా ఈ కోవలోకి చేరాడు. అతడు ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..


మేం మాటలు చెప్పం..

300 కొడతాం, 250 బాదేస్తాం అంటూ మాటలు చెప్పే జట్టు తమది కాదంటూ సన్‌రైజర్స్‌పై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్స్ వేశాడు వెంకీ అయ్యర్. కొడితే 250 పరుగులు లేదంటే 120కే ఆలౌట్ అవడం కూడా తమ స్టైల్ కాదంటూ కమిన్స్ సేనపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రతి బాల్‌ను సిక్స్ కొట్టడం అగ్రెషన్ అనిపించుకోదని స్పష్టం చేశాడు. పిచ్, కండీషన్స్‌ను అర్థం చేసుకోవడం.. పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడమే రియల్ అగ్రెషన్ అనిపించుకుంటుందని పేర్కొన్నాడు.


అయ్యర్.. అది మర్చిపోయావా..

వెంకీ అయ్యర్‌పై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో 60 పరుగులు చేసినంత మాత్రాన కాటేరమ్మ కొడుకుల గురించి కామెంట్ చేస్తావా అని ఫైర్ అవుతున్నారు. ముంబై మీద గత మ్యాచ్‌లో ఓడిపోయారుగా.. అప్పుడు ఎక్కడికి వెళ్లింది నీ అగ్రెషన్ అని చురకలు అంటిస్తున్నారు. వాంఖడేలో ఏం జరిగిందో మర్చిపోయావా అని సెటైర్స్ వేస్తున్నారు. ఇలాంటోడికి కెప్టెన్సీ ఇస్తే.. కేకేఆర్ ఖేల్‌ఖతం అని అంటున్నారు. మొత్తానికి అయ్యర్ వ్యాఖ్యలతో కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ రైవల్రీ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుందనే చెప్పాలి.


ఇవీ చదవండి:

ముంబైపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు

పంతం నెరవేర్చుకున్న బీసీసీఐ

అదే మా కొంపముంచింది: కమిన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2025 | 01:52 PM