Preity Zinta-MS Dhoni: క్యాచ్ మిస్.. ప్రీతి జింటా సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ చూడాల్సిందే
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:03 PM
PBKS vs CSK: క్రికెట్‌లో క్యాచులు జారవిడవడం కామనే. ఎంత తోపు ఫీల్డర్ అయినా ఒక్కోసారి క్యాచులు వదిలేస్తుంటారు. అయితే కీలక మ్యాచుల్లో అదీ క్రూషియల్ సిచ్యువేషన్స్‌లో చేజారిస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. నిన్న పంజాబ్-చెన్నై మ్యాచ్‌లో ఇదే చోటుచేసుకుంది.

ఒక్క క్యాచ్.. మ్యాచ్ గతినే మార్చేస్తుంది. అందుకే టేక్ క్యాచెస్.. విన్ మ్యాచెస్ అనే నానుడి క్రికెట్‌లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి బెస్ట్ ఫీల్డర్లు కూడా క్యాచులు నేలపాలు చేస్తుంటారు. తమది కాని రోజు ఎంత ప్రయత్నించినా ఫీల్డింగ్ మిస్టేక్స్‌ను ఎవరూ ఆపలేరు. అయితే కీలక మ్యాచుల్లో ఇలాంటి తప్పిదాలు జట్టు గెలుపోటములను శాసిస్తాయి. నిన్న పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాలే సీఎస్‌కే ఓటమిని డిసైడ్ చేశాయి. దీంతో ఓ తరుణంలో పంజాబ్ కో-ఓనర్ ప్రీతి జింటా సంబురాల్లో మునిగిపోగా.. చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సీరియస్‌గా చూశాడు. అసలు ఆ టైమ్‌లో ఏం జరిగింది.. అనేది ఇప్పుడు చూద్దాం..
రచిన్ చేసిన పనికి..
పంజాజ్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో శశాంక్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 17వ ఓవర్ వేసేందుకు వచ్చాడు నూర్ అహ్మద్. అతడు వేసిన బంతిని స్లాగ్ స్వీప్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు శశాంక్. అయితే టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. దీంతో దాన్ని అందుకోవాలని చూశాడు సీఎస్‌కే ఫీల్డర్ రచిన్ రవీంద్ర. కానీ అతడు క్యాచ్‌ను జారవిడిచాడు. శశాంక్ బతికిపోవడంతో పంజాబ్ కో-ఓనర్ ప్రీతి జింటా ఆనందంతో గెంతులు వేసింది. ఆ టైమ్‌లో కీపింగ్ చేస్తున్న ధోని.. స్క్రీన్ వైపు సీరియస్‌గా చూశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒకవైపు ప్రీతి ఉత్సాహం, మరోవైపు ధోని కోపం.. ఒకే ఫ్రేమ్‌లో కవర్ అవడంతో వాటే రియాక్షన్స్ అని నెటిజన్స్ అంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇవీ చదవండి:
11 క్యాచులు మిస్.. ఈ టీమ్ ఇక అస్సాంకే..
8 రికార్డులు బ్రేక్.. ఎవరీ ప్రియాన్ష్
నేను మాట్లాడితే కొట్లాటే: రహానె
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి