Rohit Sharma: రోహిత్‌కు అంబానీ వార్నింగ్.. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ..
ABN, Publish Date - Jan 07 , 2025 | 09:32 AM
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసలే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాట్ గర్జించకపోవడం, టీమ్ కూడా ఫెయిల్యూర్స్‌లో నుంచి బయటపడకపోవడంతో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగలేదు హిట్‌మ్యాన్. దీంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో రోహిత్‌కు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వార్నింగ్ ఇచ్చింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసలే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాట్ గర్జించకపోవడం, టీమ్ కూడా ఫెయిల్యూర్స్‌లో నుంచి బయటపడకపోవడంతో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగలేదు హిట్‌మ్యాన్. దీంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని.. ఇప్పట్లో రిటైర్ కాబోనని అతడు క్లారిటీ ఇచ్చినా.. ఆటకు స్వస్తి పలుకుతాడనే అనుమానాలు వస్తున్నాయి. రోహిత్ ఇదే మాదిరిగా ఆడితే చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో బెర్త్, వన్డే కెప్టెన్సీ తీసేసే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో హిట్‌మ్యాన్‌కు మరో షాక్. అతడికి వార్నింగ్ ఇచ్చింది ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్. మరి.. రోహిత్ ఏం తప్పు చేశాడని అతడ్ని హెచ్చరించారో ఇప్పుడు చూద్దాం..
రిపీటైతే వదిలేది లేదు!
ఐపీఎల్-2025కు ఇంకా సమయం ఉంది. కానీ ఇప్పటినుంచే జట్లు క్రమంగా ప్రిపరేషన్స్ మొదలుపెడుతున్నాయి. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడం, ఇతర సన్నాహాల్లో ఫ్రాంచైజీ యాజమాన్యాలు బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ సహా ముంబై జట్టులోని జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి కోర్ ప్లేయర్లకు అంబానీ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చిందని సమాచారం. ఇప్పటి నుంచే అందరూ కలసికట్టుగా ఉండాలని.. వచ్చే సీజన్‌లో అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని ఆదేశించిందట. ముంబై టీమ్ ప్రతిష్ట, క్రేజ్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని అంతా ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పిందట. సీజన్‌కు ఇంకా టైమ్ ఉన్నా ఇప్పటినుంచే అంతా ఒక్కతాటి పైకి రావాలని.. ఆటగాళ్ల మధ్య సఖ్యతకు తప్ప గొడవలు, అలకలకు చోటు లేదని స్పష్టం చేసిందట. మాట వినకపోతే కఠిన చర్యలు ఉంటాయని ముంబై యాజమాన్యం హెచ్చరించిందని వినిపిస్తోంది.
తాట తీస్తాం!
ఐపీఎల్‌లో ప్రొఫెషనలిజమ్ ఉన్న టీమ్స్‌లో ముందు వరుసలో ఉంటుంది ముంబై ఇండియన్స్. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను వెతికి పట్టుకోవడం, వారిని సానబెట్టడం, క్రమశిక్షణతో జట్టును నడపడం, టైటిల్స్ మీద టైటిల్స్ గెలవడం ముంబైలో చూడొచ్చు. ప్రతి విషయం పర్ఫెక్ట్‌గా ఉండటం, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవడం ఎంఐలో కనిపిస్తుంది. కానీ గత సీజన్‌లో ఇది టోటల్ చేంజ్ అయిపోయింది. రోహిత్ ప్లేస్‌లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాతో పాటు మ్యాచులు జరుగుతున్న సమయంలో స్టేడియాల్లో రచ్చ రచ్చ చేశారు. బూ.. అంటూ పాండ్యాను ఏడిపించారు. హార్దిక్-రోహిత్‌కు పడకపోవడం, కెప్టెన్సీ పోస్ట్ ఆశించిన సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా పాండ్యాకు దూరంగా ఉండటం, డ్రెస్సింగ్ రూమ్ గొడవలతో ఫ్రాంచైజీ పరువు పోయింది. జట్టు దారుణ ఆటతీరుతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాలేదు. దీంతో నెక్స్ట్ సీజన్‌లో ఇది రిపీట్ కాకూడదని ముంబై యాజమాన్యం భావిస్తోంది. అందుకే రోహిత్, హార్దిక్ సహా జట్టులోని సీనియర్లకు వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. జట్టు పరుపు తీస్తే ఒక్కొక్కరి తాట తీస్తామని, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారని సమాచారం.
ఇవీ చదవండి:
‘రిజర్వ్’ పేస్‌లో పదునేది?
‘సెలెక్టర్లే నిర్ణయం తీసుకొంటారు’
దృష్టంతా సాత్విక్ జోడీపైనే!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 07 , 2025 | 09:36 AM