PM Christopher Luxon: ఢిల్లీలో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్.. లెజెండ్‌తో కలసి..

ABN, Publish Date - Mar 20 , 2025 | 11:49 AM

New Zealand: న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ తన క్రికెట్ స్కిల్స్‌ బయటపెట్టారు. పీఎంగా ఎప్పుడూ దేశం, ప్రజల గురించి ఆలోచిస్తూ బిజీగా ఉండే లక్సన్.. ఈసారి బ్యాట్ పట్టి ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడారు.

PM Christopher Luxon: ఢిల్లీలో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్.. లెజెండ్‌తో కలసి..
PM Christopher Luxon

భారత అభిమానులు టీమిండియా తర్వాత అంత స్థాయిలో ఇష్టపడే జట్లలో ఒకటి న్యూజిలాండ్. ఆ దేశ క్రికెటర్లు గెలుపోటములను ఒకేలా తీసుకుంటారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉంటారు. భారత స్టార్లతో మంచి సఖ్యతను కనబరుస్తారు. అందుకే వాళ్లంటే ఇక్కడి ఫ్యాన్స్‌కు ఎక్కువ ఇష్టం. ఐపీఎల్‌లో కివీస్ ప్లేయర్లు ఆడుతుంటే అభిమానులు తెగ ఎంకరేజ్ చేస్తారు. కివీస్ ఓడితే అంతే రేంజ్‌లో బాధపడతారు కూడా. భారత్-న్యూజిలాండ్ మధ్య క్రికెట్ సంబంధాలు ఎలా ఉంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే కివీస్ ప్రధాని మన దేశానికి రాగానే బ్యాట్ పట్టి గల్లీ క్రికెట్ ఆడారు. ఢిల్లీ గల్లీల్లో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


డ్రైవ్‌లు-పుల్ షాట్లతో..

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. భారత పర్యటనలో ఉన్న ఆయన.. ఢిల్లీ గల్లీల్లో లెజెండ్ కపిల్‌దేవ్‌తో పాటు కొందరు చిన్నారులతో కలసి క్రికెట్ ఆడారు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్, మాజీ బ్యాటర్ రాస్ టేలర్ కూడా బ్యాట్ పట్టి అలరించారు. లక్సన్-కపిల్ దేవ్ ఒక జట్టుగా.. టేలర్-అజాజ్ మరో జట్టుగా విడిపోయి ఆడారు. బ్యాట్ పట్టిన కివీస్ పీఎం.. బ్యాటింగ్‌లో డ్రైవ్‌లు, పుల్ షాట్లతో ఎంటర్‌టైన్ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు లక్సన్. ‘ఇది నమ్మలేకపోతున్నా. కపిల్‌దేవ్‌తో కలసి ఢిల్లీ గల్లీల్లో క్రికెట్ ఆడా’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు ప్రధాని లక్సన్.


ఇవీ చదవండి:

64 బంతుల్లో 144 నాటౌట్

శ్రేయాస్‌ అయినా.. పంజాబ్‌ రాత మార్చేనా?

పాండ్యాకు మెంటల్ టార్చర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2025 | 11:59 AM