IND vs PAK: టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..

ABN, Publish Date - Feb 09 , 2025 | 09:59 AM

Pakistan PM Shehbaz Sharif: చాంపియన్స్ ట్రోఫీ-2025కి అంతా రెడీ అవుతోంది. మరో 10 రోజుల్లో మెగా టోర్నీ మొదలవనుంది. దీంతో అన్ని జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

IND vs PAK: టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..
IND vs PAK

క్రికెట్ లవర్స్ ఫోకస్ క్రమంగా చాంపియన్స్ ట్రోఫీపై వెళ్తోంది. మరో 10 రోజుల్లో ఈ మెగా టోర్నీ స్టార్ట్ కానుంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. ఎలాగైనా ట్రోఫీని ఎగరేసుకుపోవాలని చూస్తున్నాయి. సొంత దేశంలో టోర్నీ జరుగుతున్నందున కప్పు కొట్టేయాలని పాక్ ప్లానింగ్‌తో ఉంది. ఇందులో తప్పేం లేదు. కానీ ఆ దేశ ప్రధాన మంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ భారత్‌ను లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. రోహిత్ సేనను ఓడించడమే తమ టార్గెట్ అంటూ రెచ్చగొట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


భారత్‌ను ఓడించాల్సిందే!

చాంపియన్స్ ట్రోఫీ కప్పును సొంతం చేసుకుంటే సరిపోదని.. చిరకాల ప్రత్యర్థి టీమిండియానూ తప్పకుండా ఓడించాలని షెహ్‌బాజ్ షరీఫ్ అన్నారు. ఫిబ్రవరి 23వ తేదీన దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో షరీఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘పాకిస్థాన్ టీమ్ చాలా బలంగా ఉంది. ఇటీవల కాలంలో బాగా పెర్ఫార్మ్ చేసింది. అయితే వాళ్ల ముందు ఇప్పుడో టఫ్ చాలెంజ్ ఉంది. చాంపియన్స్ ట్రోఫీ కప్పును గెలవాలి. అదే సమయంలో భారత్‌ను కూడా ఓడించి తీరాలి. 29 ఏళ్ల గ్యాప్ తర్వాత ఓ బడా ఐసీసీ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని షరీఫ్ చెప్పుకొచ్చారు.


గతాన్ని మరిచారా?

కప్పు కంటే భారత్‌ను ఓడించడమే ముఖ్యం అనే అర్థం వచ్చేలా పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ దాయాదికి ఇచ్చిపడేస్తున్నారు నెటిజన్స్. 2021 టీ20 వరల్డ్ కప్ ఓటమి తప్పితే పాక్‌తో ఐసీసీ టోర్నీల్లో ఆడిన ప్రతిసారి టీమిండియానే గెలిచిందని గుర్తుచేస్తున్నారు. టీ20 ప్రపంచ కప్-2024లోనూ ఆ టీమ్‌ను రోహిత్ సేన చిత్తు చేసిందని చెబుతున్నారు. చరిత్ర మరిచారా.. ఈసారి కూడా భారత్ మీ బెండు తీయడం ఖాయమంటూ వార్నింగ్ ఇస్తున్నారు నెటిజన్స్. ఎంత రెచ్చగొడితే అంత ఘోర ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు.


ఇవీ చదవండి:

సీఎస్కే స్టార్‌కు గాయం.. మ్యాచ్ మధ్యలోనే రక్తం కక్కుకొని..

నాయకుడే ఆడకపోతే ఎలా..?

ఇక నుంచి.. జూనియర్లకు నజరానాల్లేవ్‌!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2025 | 10:02 AM