Virat Kohli: ఆ కుర్రాడో అద్భుతం.. ఫ్యూచర్ అతడి చేతుల్లోనే: కోహ్లీ

ABN, Publish Date - Mar 18 , 2025 | 10:00 AM

RCB Unbox Event: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ కుర్ర ఆటగాడ్ని మెచ్చుకున్నాడు. అతడిలో అపూర్వమైన ప్రతిభ దాగి ఉందన్నాడు. టీమ్ ఫ్యూచర్ అతడి చేతుల్లోనే ఉందన్నాడు.

Virat Kohli: ఆ కుర్రాడో అద్భుతం.. ఫ్యూచర్ అతడి చేతుల్లోనే: కోహ్లీ
Virat Kohli

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ కుర్ర క్రికెటర్‌ను ఆకాశానికెత్తేశాడు. అతడో అద్భుతమని ప్రశంసించాడు. చాలా టాలెంటెడ్ బ్యాటర్ అని మెచ్చుకున్నాడు. సాధారణంగా విరాట్ అంత ఈజీగా ఎవర్నీ పొగడడు. అవతలి ఆటగాళ్లలోని నైపుణ్యం, క్రమశిక్షణ, పట్టుదలను చూసే కామెంట్స్ చేస్తుంటాడు. అలాంటిది ఓ యంగ్ బ్యాటర్‌ను ఈ రేంజ్‌లో మెచ్చుకోవడం అంటే సమ్‌థింగ్ స్పెషలే. మరి.. కింగ్ కోహ్లీ నుంచి ప్రశంసలు అందుకున్న ఆ ఆటగాడు ఎవరు.. అనేది ఇప్పుడు చూద్దాం..


మీ సపోర్ట్ అవసరం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు కోహ్లీ. బెంగళూరులో సోమవారం నిర్వహించిన ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌లో విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నయా సీజన్‌తో పాటు జట్టు కూర్పు గురించి పలు విషయాలు పంచుకున్నాడు. తన ప్రసంగం ముగిసే సమయంలో కొత్త సారథిని ఉద్దేశించి మాట్లాడాడు కోహ్లీ. రజత్ పాటిదార్ ఆర్సీబీని సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తాడని అన్నాడు. అతడిపై ప్రేమ కురిపించండి, ఆదరించండి అని అభిమానులను కోరాడు విరాట్. రజత్‌కు మీ సపోర్ట్ కావాలన్నాడు.


తప్పక నెరవేరుస్తాడు

రజత్ పాటిదార్ ఓ అద్భుతమైన ఆటగాడని కోహ్లీ ప్రశంసించాడు. అయితే అతడి భుజాలపై కీలకమైన బాధ్యతలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ టీమ్‌ను విజయవంతంగా నడిపించడమే గాక అభిమానుల నమ్మకాన్ని కూడా నిలబెట్టే బాధ్యత రజత్ భుజాల మీద ఉందన్నాడు విరాట్. ఈ ఫ్రాంచైజీ తన మీద పెట్టుకున్న ఆశల్ని అతడు తప్పక నెరవేరుస్తాడనే విశ్వాసం తనకు ఉందన్నాడు. టీమ్‌ను అతడు గెలుపు బాటలో నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. సారథిగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, ప్రతిభ అతడిలో మెండుగా ఉన్నాయని కోహ్లీ స్పష్టం చేశాడు. రజత్‌ పాటిదార్‌కు తన మద్దతు ఉంటుందన్నాడు కింగ్.


ఇవీ చదవండి:

ఐపీఎల్ కెప్టెన్లకు బీసీసీఐ హుకుం

చాంపియన్స్‌ ట్రోఫీతో రూ.737 కోట్ల నష్టం

రాజస్థాన్‌..కొత్త కొత్తగా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2025 | 10:14 AM