Share News

Rohit- Axar: అక్షర్‌కు రోహిత్ బంపరాఫర్.. మొత్తానికి తప్పు సరిదిద్దుకున్నాడు

ABN , Publish Date - Feb 21 , 2025 | 02:19 PM

IND vs BAN: స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు బంపరాఫర్ ఇచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. చేసిన తప్పును అతడు మొత్తానికి సరిదిద్దుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Rohit- Axar: అక్షర్‌కు రోహిత్ బంపరాఫర్.. మొత్తానికి తప్పు సరిదిద్దుకున్నాడు
Rohit Sharma

చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 228 పరుగుల టార్గెట్‌ను మరో 21 బంతులు ఉండగానే ఛేజ్ చేసేసింది. అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు కలసికట్టుగా రాణించడం, ఆరంభ మ్యాచ్‌లో గెలుపుతో అంతా సంబురాలు చేసుకుంటున్నారు. ఇదే జోరులో ఇతర మ్యాచుల్లోనూ నెగ్గి సెమీస్‌కు దూసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు బంపరాఫర్ ఇచ్చాడు సారథి రోహిత్. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


డిన్నర్‌కు రెడీ!

బంగ్లాతో మ్యాచ్‌లో రోహిత్ ఓ గోల్డెన్ చాన్స్ మిస్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సులువైన క్యాచ్‌ను అతడు జారవిడిచాడు. అప్పటికే వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టిన అక్షర్.. హిట్‌మ్యాన్ వల్ల తృటిలో హ్యాట్రిక్ అవకాశం కోల్పోయాడు. దీంతో మ్యాచ్ తర్వాత అతడికి సారీ చెప్పాడు. అంతేకాదు.. అక్షర్‌కు డిన్నర్ ఆఫర్ చేశాడు రోహిత్. ‘అది ఈజీ క్యాచ్. దాన్ని పట్టుకోవాల్సింది. స్లిప్స్‌లో రెడీగా ఉన్నా. కానీ చాన్స్ మిస్ అయింది. హ్యాట్రిక్ దూరం చేసినందుకు అక్షర్‌కు క్షమాపణలు చెబుతున్నా. అతడ్ని డిన్నర్‌కు తీసుకెళ్తా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా, బంగ్లాతో మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. బంతితో ఆకట్టుకున్నా బ్యాట్‌తో మాత్రం ఫెయిల్ అయ్యాడు. 12 బంతుల్లో 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.


ఇవీ చదవండి:

నరకం నుంచి బయటపడ్డా.. ధనశ్రీ పోస్ట్

వీలైతే.. క్షమించేయండి బ్రో..!

సాత్విక్‌ తండ్రి హఠాన్మరణం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 02:24 PM