Rohit-Axar: సారీ చెప్పిన రోహిత్.. చేతులు జోడించి..
ABN, Publish Date - Feb 20 , 2025 | 04:09 PM
IND vs BAN: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపిస్తోంది టీమిండియా. మన బౌలర్ల దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలబడాలంటేనే వణుకుతున్నారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్షమాపణలు చెప్పాడు. సారీ అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. హిట్‌మ్యాన్ సారీ చెప్పింది మరెవరికో కాదు.. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కే. బంగ్లా బ్యాటింగ్ సమయంలో అక్షర్ వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లతో జోరు మీదున్నాడు. 9వ ఓవర్‌లో తంజిద్ హసన్ (25), ముష్ఫికర్ రహీం (0)ను బ్యాక్ టు బ్యాక్ పెవిలియన్‌కు పంపించాడు అక్షర్. ఆ తర్వాతి బంతికి జేకర్ అలీని కూడా దాదాపుగా ఔట్ చేయబోయాడు. అయితే రోహిత్ తప్పిదంతో హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు అక్షర్.
హ్యాట్రిక్ మిస్!
జేకర్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో నిల్చున్న రోహిత్ జారవిడిచాడు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో టీమ్ ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. హిట్‌మ్యాన్ కూడా కోపం తట్టుకోలేకపోయాడు. తప్పు చేశానంటూ నేలను గట్టిగా కొట్టాడు. అనంతరం ఎలాగోలా సంభాళించుకున్నాడు. హ్యాట్రిక్ వచ్చేసిందని ఎంతో ఆశగా చూసిన అక్షర్ నిరాశలో కూరుకుపోవడంతో అతడికి సారీ చెప్పాడు రోహిత్. చేతులు జోడించి అతడి వైపు చూస్తూ క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, బంగ్లాదేశ్ ప్రస్తుతం 21.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులతో ఉంది. జేకర్ అలీ (24 నాటౌట్), తౌహిద్ హృదయ్ (26 నాటౌట్) ఇప్పుడు క్రీజులో ఉన్నారు.
ఇవీ చదవండి:
గెలవాలంటే అదొక్కటే మార్గం అంటున్న అక్తర్
ప్లేయింగ్ 11లో వాళ్లకు చాన్స్ ఇవ్వని రోహిత్
దిగొచ్చిన పాక్.. స్టేడియంలో భారత జెండా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 20 , 2025 | 04:35 PM