Rohit Sharma-Zaheer Khan: ముంబైపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు.. చాట్ వీడియో వైరల్

ABN, Publish Date - Apr 04 , 2025 | 12:23 PM

Mumbai Indians: ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ఆ జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లక్నో మెంటార్ జహీర్ ఖాన్‌తో కలసి అతడు మాట్లాడిన చాట్ వీడియో వైరల్‌ అవుతోంది.

Rohit Sharma-Zaheer Khan: ముంబైపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు.. చాట్ వీడియో వైరల్
Rohit Sharma

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ముంబై జట్టు గురించి అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. లక్నో సూపర్ జియాంట్స్ మెంటార్ జహీర్ ఖాన్‌తో కలసి హిట్‌మ్యాన్ ముచ్చటిస్తున్న చాట్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో వీళ్లిద్దరితో పాటు ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. అసలు ఏం జరిగింది.. జహీర్‌తో రోహిత్‌ ఏం అన్నాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..


జహీర్‌తో కలసి..

ముంబై-లక్నో మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటలు చిందించారు. ఈ తరుణంలోనే జహీర్-రోహిత్ ఒకరికొకరు తారసపడ్డారు. వాళ్లు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే జహీర్‌తో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. చేయాల్సినప్పుడు అన్నీ చేశానని, ఇప్పుడు తాను ఏమీ చేయాల్సిన అవసరం లేదన్నాడు. అలా అన్న వెంటనే వెనుక నుంచి రిషబ్ పంత్ ఒక్కసారిగా వచ్చి అతడ్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు.


కోపం తగ్గలేదా..

ముంబై కెప్టెన్సీ, టీమ్ ప్రదర్శనను ఉద్దేశించే రోహిత్ పైవ్యాఖ్యలు చేశాడని నెటిజన్స్ అంటున్నారు. సారథ్య బాధ్యతలు లేవు కాబట్టి ఇక తనకు సంబంధం లేదని, బ్యాటింగ్ ఒక్కటే తన పని అనేలా హిట్‌మ్యాన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఎంఐ టీమ్ మేనేజ్‌మెంట్ విషయంలో రోహిత్ కోపం ఇంకా తగ్గలేదని, కెప్టెన్సీ నుంచి తనను తీసేసిన తీరుపై అతడు ఇంకా ఆగ్రహంతోనే ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గత ఐపీఎల్ టైమ్‌లో అప్పటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ సంభాషించిన వీడియో కూడా వైరల్ అయింది. ఇదే నాకు లాస్ట్ అని హిట్‌మ్యాన్ అనడంతో ఎంఐతో తెగదెంపులు చేసుకొని.. కొత్త ఫ్రాంచైజీలోకి అతడు అడుగు పెడతాడని అంతా భావించారు. కానీ ముంబైలోనే కంటిన్యూ అవుతున్నాడు. అంతా బాగుందని అనుకునేలోపు తాజా వీడియోతో మళ్లీ లేనిపోని సందేహాలకు చాన్స్ ఇచ్చినట్లయింది.


ఇవీ చదవండి:

పంతం నెరవేర్చుకున్న బీసీసీఐ

అదే మా కొంపముంచింది: కమిన్స్

సూర్య ముంబై వెంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2025 | 12:31 PM