RR vs RCB Live Updates: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. ఆర్సీబీకి బిగ్ చాలెంజ్
ABN , Publish Date - Apr 13 , 2025 | 05:25 PM
IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ జైస్వాల్ పట్టుదలతో ఆడి తన టీమ్ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరి.. ఆర్సీబీ టార్గెట్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్ రాయల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సంజూ సేన ఓవర్లన్నీ ఆడి 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. బ్యాట్ మీదకు బంతి సులువుగా రాకపోవడంతో షాట్లు కొట్టడం చాలా టఫ్‌గా మారింది. అలాంటి పిచ్ మీద ఇది చాలెంజింగ్ స్కోరు అనే చెప్పాలి. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75), రియాన్ పరాగ్ (22 బంతుల్లో 30), ధృవ్ జురెల్ (23 బంతుల్లో 35) రాణించారు. ముఖ్యంగా జైస్వాల్ అదరగొట్టాడనే చెప్పాలి.
పాతుకుపోయిన జైస్వాల్
ఫస్ట్ ఓవర్ నుంచి దాదాపు 16వ ఓవర్ వరకు క్రీజులో పాతుకుపోయాడు జైస్వాల్. బ్యాటింగ్ కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేషన్ చేస్తూనే.. అడపాదడపా భారీ షాట్లు కూడా కొట్టాడు. మొత్తంగా 10 బౌండరీలు, 2 సిక్సులతో రఫ్ఫాడించాడు. పరాగ్ మంచి స్టార్ట్ అందుకున్నా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యష్ దయాల్, కృనాల్ పాండ్యా, జోష్ హేజల్‌వుడ్ చెరో వికెట్ తీశారు. బెంగళూరు బ్యాటింగ్ పవర్‌కు ఈ స్కోరు చేజ్ చేయొచ్చు. కానీ కోహ్లీ, పాటిదార్‌లో ఒకరు చివరి వరకు ఆడాలి. యాంకర్ ఇన్నింగ్స్ ఆడేవారు లేకపోతే చేజింగ్ చాలా టఫ్‌గా మారొచ్చు.
ఇవీ చదవండి:
ఢిల్లీ వర్సెస్ ముంబై.. లెక్కలు మారుస్తారా..
ప్లేయింగ్ 11తో మెంటలెక్కిస్తున్నారు
అభిషేక్ నిజంగా గ్రేట్.. జ్వరంతో బాధపడుతూ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి