Steve Smith: సచిన్‌తో సమానంగా స్టీవ్ స్మిత్.. చూస్తుండగానే రేంజ్ మారిపోయింది

ABN, Publish Date - Jan 29 , 2025 | 06:35 PM

Steve Smith Equals Sachin Tendulkar: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ దూసుకెళ్తున్నాడు. పరుగుల వరద పారిస్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అతడు సమం చేశాడు.

Steve Smith: సచిన్‌తో సమానంగా స్టీవ్ స్మిత్.. చూస్తుండగానే రేంజ్ మారిపోయింది
Steve Smith

AUS vs SL: ప్రస్తుత క్రికెట్‌లో ఫ్యాబ్-4లో ఒకడిగా ఫుల్ క్రేజ్ సంపాదించాడు ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్‌తో పాటు ఈ జనరేషన్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా అతడు ప్రశంసలు అందుకుంటున్నాడు. లెగ్ స్పిన్నర్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్మిత్.. ఆ తర్వాత బ్యాట్‌తో ఆకట్టుకుంటూ ఇప్పుడు ఏకంగా లెజెండ్ స్థాయిని అందుకునే దిశగా వడివడిగా పరుగులు పెడుతున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ దిగ్గజాల సరసన చోటు దక్కించుకుంటున్నాడు. అలాంటోడు తాజాగా మరో అరుదైన ఘతతను అందుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


అరుదైన క్లబ్‌లో చోటు!

శ్రీలంకతో జరుగుతున్న గాలె టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్లబ్‌లో స్థానం దక్కించుకున్న 15వ బ్యాటర్‌గా అతడు అరుదైన ఘనత సాధించాడు. 10 వేల పరుగుల మార్క్‌ను అందుకునేందుకు స్మిత్‌కు 205 ఇన్నింగ్స్‌లు పట్టాయి. పది వేల పరుగులను అందుకున్న 3వ అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా అతడు నిలిచాడు. ఈ లిస్ట్‌లో ఆ దేశానికి చెందిన పంటర్ రికీ పాంటింగ్ (194 ఇన్నింగ్స్‌లు) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ (200 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు.


కొత్త రికార్డులు ఖాయం!

లంకతో జరుగుతున్న టెస్ట్‌లో 104 పరుగుల స్టన్నింగ్ నాక్‌తో మెరిశాడు స్మిత్. ఇది అతడి కెరీర్‌లో 35వ సెంచరీ కావడం విశేషం. కెరీర్‌లో టెస్టుల్లో 205 ఇన్నింగ్స్‌లు ముగిసే సమయానికి అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్ల జాబితాలో సచిన్ (35 సెంచరీలు) సరసన స్మిత్ చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్ట్‌లో కూడా పాంటింగ్ డామినేషన్ నడుస్తోంది. అతడు 36 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంకొన్నేళ్లు నిలకడగా ఆడితే ఈ రికార్డులన్నీ తుడిచిపెట్టేసి.. సరికొత్త రికార్డులను స్మిత్ సెట్ చేయడం ఖాయం. చూస్తుండగానే స్మిత్ తక్కువ వ్యవధిలో టెస్టుల్లో ఈ స్థాయికి చేరుకోవడం నమ్మశక్యం కావడం లేదని నెటిజన్స్ అంటున్నారు. కాగా, లంకతో మొదటి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్లకు 330 పరుగులతో ఉంది. స్మిత్ (104 నాటౌట్)తో పాటు ఉస్మాన్ ఖవాజా (147 నాటౌట్) క్రీజులో ఉన్నారు.


ఇవీ చదవండి:

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో తిలక్.. ఆజామూ నీకు మూడింది

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 06:44 PM