Share News

Virat Kohli: సెంచరీ కంటే అదే ముఖ్యం.. అందుకే కోహ్లీ గ్రేట్ అనేది

ABN , Publish Date - Mar 05 , 2025 | 10:21 AM

Champions Trophy Semies 2025: ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు కింగ్ కోహ్లీ. వరుసగా బిగ్ నాక్స్‌తో టీమిండియాకు తాను అసలైన మూలస్తంభం అని మరోమారు నిరూపించాడు. తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు.

Virat Kohli: సెంచరీ కంటే అదే ముఖ్యం.. అందుకే కోహ్లీ గ్రేట్ అనేది
Virat Kohli

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనలో పస ఇంకా అలాగే ఉందని నిరూపించాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో వరుసగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ భారత విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. పాకిస్థాన్‌పై సెంచరీ బాదిన కింగ్.. నిన్నటి నాకౌట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మీద 98 బంతుల్లో 84 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లడంలో అతడిదే ముఖ్యపాత్ర. తన పనైపోయింది.. ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అనే విమర్శలకు బ్యాట్‌తోనే గట్టిగా సమాధానం ఇచ్చాడు. అయితే అంతా బాగానే ఉన్నా నాకౌట్‌ మ్యాచ్‌లో అతడు 16 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అవడం ఫ్యాన్స్‌కు బాధ కలిగించింది. దీనిపై మ్యాచ్ తర్వాత రియాక్ట్ అయ్యాడు కింగ్. అతడు ఏమన్నాడంటే..


దాన్ని మించినది లేదు

సెంచరీలు, మైల్‌స్టోన్స్ కంటే టీమ్ గెలుపే తనకు ముఖ్యమని అన్నాడు విరాట్. రికార్డుల గురించి ఆలోచించే మైండ్‌సెట్ లేదని.. జట్టు విజయం తప్ప ఇంకేదీ తనకు ఇంపార్టెంట్ కాదన్నాడు కోహ్లీ. ‘నేను క్రీజులో ఉండటం చాలా కీలకం. జట్టు గెలుపుకే నా తొలి ప్రాధాన్యత. మైల్‌స్టోన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆడుతూ పోతుంటే రికార్డులు అవే క్రియేట్ అవుతాయి. ముందు విజయం గురించి ఆలోచించాలి. టీమ్ గెలుపు కోసం నేనేం చేస్తున్నాను.. జట్టును విజయతీరాలకు చేరుస్తున్నానా లేదా అనేది నా మైండ్‌లో నడుస్తూ ఉంటుంది. భారత్ గెలిస్తే అదే నాకు గర్వకారణం. నేను సెంచరీ కొడితే గొప్పే. కానీ అంతకంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం ముఖ్యం. నా డ్యూటీ నేను చేయాలి. అదే కీలకం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్.. సెంచరీ కంటే టీమ్ గెలుపు కోసం ఇంతలా తపనపడటం మామూలు విషయం కాదని.. అందుకే విరాట్ గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు: రాహుల్

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ సీరియస్

డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి కుటుంబ సభ్యులకు నో ఎంట్రీ!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2025 | 03:16 PM