Share News

India Womens Hockey Team: సలీమాకే పగ్గాలు

ABN , Publish Date - Apr 15 , 2025 | 03:34 AM

ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల హాకీ జట్టులో ఐదు కొత్తముఖాలు ఎంపికయ్యాయి. సలీమా టెటే సారథ్యంలోని 26 మంది సభ్యుల జట్టును హాకీ ఇండియా ప్రకటించింది

India Womens Hockey Team: సలీమాకే పగ్గాలు

  • ఆసీస్‌ టూర్‌కు భారత మహిళల హాకీ జట్టు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల హాకీ జట్టులో ఐదు కొత్తముఖాలకు చోటు దక్కింది. మిడ్‌ఫీల్డర్‌ సలీమా టెటే సారథ్యంలోని 26 మంది సభ్యుల జట్టును హాకీ ఇండియా సోమవారం ప్రకటించింది. జ్యోతి సింగ్‌, సుజాత కుజుర్‌, అజ్మీనా కుజుర్‌, పూజా యాదవ్‌, సలీమా సోదరి మహిమ టెటే తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 26 నుంచి మే 4 వరకు జరిగే పర్యటనలో ఆతిథ్య ఆసీ్‌సతో భారత్‌ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఆసీ్‌స-ఎతో రెండు మ్యాచ్‌లు, సీనియర్‌ జట్టుతో మూడు మ్యాచ్‌ల్లో మనమ్మాయిలు తలపడనున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 03:35 AM