Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు.. ఐపీఎల్‌లో 600 ఫోర్లు
ABN , Publish Date - Mar 29 , 2025 | 10:40 PM
ఆరంభ ఐపీఎల్ సీజన్ నుంచి క్రమం తప్పకుండా అన్ని మ్యాచ్‌లు ఆడుతున్న క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకడు. ధోనీ తర్వాత ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు రోహిత్ శర్మ. తాజాగా రోహిత్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఐపీఎల్‌లో 600 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

ఆరంభ ఐపీఎల్ (IPL 2025) సీజన్ నుంచి క్రమం తప్పకుండా అన్ని మ్యాచ్‌లు ఆడుతున్న క్రికెటర్లలో రోహిత్ శర్మ (Rohit Sharma) ఒకడు. ధోనీ తర్వాత ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు రోహిత్ శర్మ. తాజాగా రోహిత్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఐపీఎల్‌లో 600 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఐపీఎల్‌లో 600 ఫోర్లు కొట్టిన వారు ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే ఉన్నారు. తాజాగా రోహిత్ నాలుగో ఆటగాడిగా ఆ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ ఈ ఘనత సాధించాడు (Rohit Sharma Record).
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు చెలరేగారు (MI vs GT). టాస్ గెలిచిన ముంబై టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టీమ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ (8) అదే ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ఆ తర్వాతి ఓవర్లో రికెల్‌టన్‌ను కూడా సిరాజ్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ (27 బంతుల్లో 35 బ్యాటింగ్), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 25) నిలకడగా ఆడుతున్నారు. దీంతో ప్రస్తుతం ముంబై 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 60 బంతుల్లో 111 పరుగులు చేయాలి.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..
మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..