Share News

Mary Kom Divorce: భర్తకు మేరీకోమ్ విడాకులు.. వెలుగులోకి సంచలన నిజాలు

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:02 PM

Mary Kom Husband K Onler Kom: స్టార్ బాక్సర్ మేరీకోమ్ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. భర్త కరుంగ్ ఓంక్లర్‌తో విభేదాల కారణంగా ఆమె విడిపోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే వీళ్ల విడాకులకు సంబంధించిన సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.

Mary Kom Divorce: భర్తకు మేరీకోమ్ విడాకులు.. వెలుగులోకి సంచలన నిజాలు
Mary Kom

భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ డివోర్స్ రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. 6 సార్లు వరల్డ్ చాంపియన్ అయిన ఆమె.. భర్త కరుంగ్ ఓంక్లర్‌తో పెళ్లి బంధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఆయనతో విడిపోవాలని ఆమె డిసైడ్ అయిందట. త్వరలో ఈ జంట డివోర్స్ తీసుకుంటారని వినిపిస్తోంది. అయితే 20 ఏళ్లు కలసి ఉన్న ఈ కపుల్ విడిపోవడం వెనుక ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. భర్త ఓంక్లర్ వద్దని వారించినా అనవసరంగా డబ్బు ఖర్చు చేసిన మేరీకోమ్.. ఈ వ్యవహారాన్ని విడాకుల దాకా తీసుకొచ్చిందని వినిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..


ఆ ఒక్క రీజన్‌తో..

మేరీకోమ్ సొంతరాష్ట్రం మణిపూర్‌లో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో పోటీపడిన మేరీ భర్త ఓంక్లర్ ఓటమిపాలయ్యాడు. ఆ ఎన్నికల క్యాంపెయినింగ్ కోసం ఈ దంపతులు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారట. కానీ అనూహ్య ఓటమి ఎదురవడంతో మేరీకోమ్ తట్టుకోలేకపోయిందట. భర్త ఓడిపోవడం, డబ్బులు కూడా పోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైందట. దీంతో కొన్నాళ్ల తర్వాత నలుగురు పిల్లల్ని తీసుకొని ఫరియాబాద్‌కు వచ్చేసిందట స్టార్ బాక్సర్. అటు ఆమె భర్త ఓంక్లర్ కొంతమంది కుటుంబ సభ్యులతో కలసి ఢిల్లీలోనే ఉంటున్నాడట.


తప్పు మేరీదేనా..

మేరీకోమ్ దంపతులు విడిపోవడానికి ఎన్నికలే కారణమని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు నష్టపోవడం, ఓటమి పాలవడం ఆమెను తీవ్రంగా బాధించాయట. ఎలక్షన్స్‌లో పోటీ చేసేది లేదని భర్త ఓంక్లర్ ఎంత మొత్తుకున్నా మేరీకోమ్ బలవంతం చేసి నిలబెట్టారని.. తీరా ఓడిపోయాక, ఆయన్నే బాధ్యుడ్ని చేస్తూ వదిలేసి వేరే చోటుకు వెళ్లిపోయిందట. దీంతో మేరీ తప్పు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇది న్యాయమా..

స్వతహాగా సాకర్ ప్లేయర్ అయిన ఓంక్లర్.. మేరీకోమ్ కోసం ఆటకు గుడ్‌బై చెప్పి భార్యకు తోడుగా నిలబడ్డాడు. బాక్సింగ్ జర్నీలో అండగా ఉండటమే గాక ఇంటి పనులు, బాధ్యతలు నెత్తి మీద పెట్టుకున్నాడు. దాదాపు 20 ఏళ్లుగా ఆమెకు అన్ని విధాలుగా సపోర్ట్‌గా ఉంటూ వచ్చాడు ఓంక్లర్. పిల్లల పెంపకం కూడా ఆయనే చూసుకున్నాడు. అలాంటోడికి డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అవ్వడం, పిల్లలకు ఆయన్ను దూరంగా ఉంచడం ఏమాత్రం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. తానే ఎన్నికల్లో పోటీ చేయించి.. ఓటమికి ఆయన్ను కారణంగా చూపి, డబ్బు పోయిందనే రీజన్‌తో విడిపోవాలని అనుకోవడం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఏంటనేది మేరీకోమ్-ఓంక్లర్‌కే తెలియాలి.


ఇవీ చదవండి:

వార్నీ 42 కోట్లా.. ఆర్సీబీ డామినేషన్‌..

సన్‌రైజర్స్‌ ఆశలన్నీ హనుమయ్య మీదే..

ఈగోలతో ఒరిగేదేం లేదు: కోహ్లీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 09 , 2025 | 05:09 PM