IPL First Match: మొదటి రోజే IPL అభిమానులకు బ్యాడ్ న్యూస్ అదే జరిగితే మ్యాచ్ రద్దు
ABN , Publish Date - Mar 21 , 2025 | 10:43 AM
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన వేదికగా జరగాల్సి ఉండటంతో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ వేడుక నిర్వహిస్తారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. కానీ కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.

ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానలు ఎదురుచూస్తు్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్ 2024 ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో మ్యాచ్‌లకు వర్షం అడ్డంకి కాదనేది చాలామంది క్రికెట్ అభిమానుల అభిప్రాయం. కానీ వాతావరణ శాఖ అధికారుల నివేదిక మాత్రం ఐపీఎల్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
వాతావరణం సహకరించకపోతే మొదటి మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్ రద్దైతే ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లకు రిజర్వుడే ఉండదు. దీంతో మ్యాచ్ జరగకపోతే రెండు టీమ్‌లకు చెరొక పాయింట్ వస్తుంది. ఐపీఎల్ 2024 ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ తన సొంత మైదనం ఈడెన్ గార్డెన్స్‌లో 2025 సీజన్ మొదటి మ్యాచ్ బెంగళూరుతో ఆడాల్సి ఉంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను విజయంతో ప్రారంభించాలని రెండు జట్లు పట్టుదలో ఉన్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని నివేదించడంతో తొలి మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి.
ప్రారంభ వేడుకపై అనుమానాలు
సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన వేదికగా జరగాల్సి ఉండటంతో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ వేడుక నిర్వహిస్తారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. కానీ కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల కారణంగా మార్చి 20 నుంచి 22 వరకు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం పడటానికి 90 శాతం అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఐపీఎల్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.
వర్షాలు ఎక్కడెక్కడ
బిర్భూమ్, ముర్షిధామన్, నాడియా, తూర్పు బంధమాన్ జిల్లాలతో పాటు తూర్పు మిడ్నాపూర్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, మెరుపులు, వడగళ్ల వర్షంత పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు ఐపీఎల్ మొదటి మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరుణడి కరుణపైనే ఈడెన్ గార్డెన్‌లో మంగళవారం మ్యాచ్ ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్డ్.. కాసేపట్లో విడుదల..
Hyderabad: ఇందిరాపార్కులో టాయ్ ట్రైన్..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here