Share News

బుమ్రా సిద్ధం

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:57 AM

భారత జట్టు స్టార్‌ పేసర్‌ బుమ్రా ఐపీఎల్‌ బరిలో దిగుతున్నాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సోమవారం ఇక్కడ జరిగే మ్యాచ్‌లో బుమ్రా ఆడనున్నాడు. ఈమేరకు అతడు...

బుమ్రా సిద్ధం

బెంగళూరుతో నేటి మ్యాచ్‌ బరిలో..

ముంబై : భారత జట్టు స్టార్‌ పేసర్‌ బుమ్రా ఐపీఎల్‌ బరిలో దిగుతున్నాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సోమవారం ఇక్కడ జరిగే మ్యాచ్‌లో బుమ్రా ఆడనున్నాడు. ఈమేరకు అతడు ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరాడు. గత జనవరిలో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ఐదో, చివరి టెస్ట్‌ సందర్భంగా బుమ్రా వెన్ను గాయానికి లోనైన సంగతి తెలిసిందే. దాంతో చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యాడు. ‘బెంగళూరుతో సోమవారం జరిగే మ్యాచ్‌లో బుమ్రా బరిలోకి దిగుతున్నాడు. ఆదివారంనాడు అతడు సాధన చేశాడు’ అని ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మహేల జయవర్ధనే వెల్లడించాడు. ఇక..మోకాలి గాయంతో లఖ్‌నవూతో గత మ్యాచ్‌కు దూరమైన రోహిత్‌ శర్మ వాంఖడేలో ఆదివారం నెట్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ‘రోహిత్‌ నెట్స్‌లో బ్యాటింగ్‌ సాధన చేశాడు. కానీ బ్యాటింగ్‌ సమయంలో సౌకర్యంగా లేడు’ అని జయవర్ధనే తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2025 | 04:57 AM