Delhi Capitals Captain Axar Patel: వావ్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఇతడా..
ABN , Publish Date - Mar 14 , 2025 | 10:40 AM
ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అక్షర్ పటేల్‌కు దక్కాయి. ఈ మేరకు డీసీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.

ఇంటర్నె్ట్ డెస్క్: త్వరలో ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టుకు సారథిగా ఛాంపియన్స్ ట్రోఫీ హీరో అక్షర్ పటేల్‌ను ఎంపి చేసింది. వచ్చే మెగా ఆక్షన్‌లో అతడిని రిటెయిన్ చేసుకునేందుకు సిద్ధమైంది (Axar Patel DC Captain).
2019 నుంచి అక్షర్ పటేల్ డీసీ జట్టుతో కొనసాగుతున్నాడు. నాయకత్వంలో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ జనవరిలో అతడిని వైస్ కెప్టెన్సీకి ఎంపిక చేసింది.
గుజరాత్‌కు చెందిన అక్షర్మూడు ఫార్మాట్లలో 23 మ్యాచుల వరకూ ఆడాడు. ఇటీవల సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో కూడా పాల్గొన్నాడు. గతేడాది ఓ మ్యాచ్‌లో డీసీకి సారథిగా వ్యవహరించాడవు. అయితే, డీసీ కచ్చితంగా గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో, ప్లేఆఫ్స్‌ను చేరలేకపోయింది.
నేటి నుంచి వైజాగ్ ఐపీఎల్ టిక్కెట్ల విక్రయం
పంత్ నిష్క్రమణ తరువాత మరో సారథి కోసం డీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. కేఎల్ రాహుల్‌కు కెప్టె్న్సీ పదవి ఇవ్వచ్చన్న అంచనాతో అతడికి డీసీ రూ.14 కోట్లకు సొంతం చేసుకున్నా చివరకు అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపింది. జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన అతడికే సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఆరు సీజన్లలో ఇప్పటివరకూ అక్షర్ పటేల్ 82 గేమ్స్ ఆడాడు. గతేడాది అతడు మొత్తం 235 రన్స్ స్కోర్ చేశాడు. సగటు స్కోరు 30 కాగా, 7.65 ఎకానమీ రేటుతో మొత్తం 11 వికెట్లు తీశాడు.
భారత్.. ఒకేరోజు మూడు ఫార్మాట్లలో ఆడగలదు
ఇక తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అక్షర్ కీలక పాత్ర పోషించాడు. 4.35 ఎకానమి రేటుతో ఐదు వికెట్లు కొల్లగొట్టిన అక్షర్ నెం.5లో బ్యాటింగ్‌కు దిగి కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ ఆరంభం నుంచీ బరీలో ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేదు. గత సీజన్‌లో 6వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది లక్షర్ పటేల్.. హెడ్ కోచ్ హేమంగ్ బదానీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ రావు, అసిస్టెంట్ కోచ్ మ్యాథ్యూ మాట్‌తో కలిసి పనిచేయనున్నాడు. మర్చి 24 విశాఖపట్నం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీతో డీసీ తలపడనుంది.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి