Yashasvi Jaiswal: ముంబై జట్టుకు గుడ్ బాయ్ చెప్పిన యశస్వి జైస్వాల్..అసలేమైంది..
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:09 PM
టీమిండియా యువ క్రికెటర్లలో యశస్వి జైస్వాల్ చాలా కీలకమైన ఆటగాడు. కానీ తాజాగా ముంబై జట్టుకు షాకిచ్చాడు. ముంబై రాష్ట్ర జట్టుతో తన అనుబంధాన్ని వీడుతూ, గోవా క్రికెట్ జట్టులోకి చేరాలని నిర్ణయించుకున్నాడు.

టీమిండియా యువ ఆటగాళ్లలో మంచి క్రేజ్ ఉన్న వారిలో యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కూడా ఒకరు. అండర్-19 జట్టు నుంచి ఇప్పటి వరకు తన ఆటతీరుతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముంబై రాష్ట్ర జట్టును విడిచి, గోవా క్రికెట్ జట్టులో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటివరకు జైస్వాల్ అండర్ 19 జట్టులో భాగంగా, అలాగే ముంబై రాష్ట్ర జట్టులో ఆడిన క్రమంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు జైస్వాల్ ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకుని, గోవా జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడు.
అసలు కారణం ఏంటి..
ఈ నిర్ణయం ముంబై క్రికెట్ అభిమానులతోపాటు అనేక మందిని ఆశ్చర్యపరించింది. ఈ మార్పుకు వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. గోవా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంభా దేశాయ్, జైస్వాల్‌కు గోవాలో ఆడేందుకు స్వాగతం పలికారు. మేము ఆయనను స్వాగతిస్తున్నామని, అతను తదుపరి సీజన్ నుంచి మా తరపున ఆడతాడని శంభా దేశాయ్ తెలిపారు. జైస్వాల్ గోవా జట్టులో చేరడంతో, ముంబై క్రికెట్ యువ ఆటగాళ్లపై కూడా కొంత ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
కెప్టెన్సీ కోసమేనా..
జైస్వాల్ గోవా జట్టులో చేరిన తర్వాత, గోవా జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జైస్వాల్ ఇప్పటికే భారత క్రికెట్ జట్టులో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో అతను గోవా జట్టులో చేరిన తర్వాత కెప్టెన్సీకి అర్హత కలిగి ఉంటాడని, చేసే ఛాన్సుందని అంటున్నారు. ఈ క్రమంలో మేము అతనిని ఆ దిశలో నియమించేందుకు కృషి చేస్తామని గోవా క్రికెట్ అసోసియేషన్ తెలుపడం విశేషం.
తగ్గిన ప్రదర్శన
2025 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న జైస్వాల్, ఈ సీజన్‌లో కొంత నిరాశ జనకమైన ప్రదర్శనను కనబరచాడు. మొదటి మూడు మ్యాచ్‌లలో అతను కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. 11.33 సగటుతో కేవలం 3 మ్యాచ్‌లలో 34 పరుగులు చేసిన జైస్వాల్ స్ట్రైక్ రేట్ 106.25 మాత్రమే. ప్రస్తుతం అతను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పవర్ ప్లే సమయంలో అతనికి ఎదురైన సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2024 ఐపీఎల్ సీజన్‌లో, అతను పవర్ ప్లే మొదటి మూడు ఓవర్లలో 18 సార్లు అవుట్ అయ్యాడు. ఇది దాదాపు 44 శాతం అవుట్ రేటు. 2022, 2023 సీజన్లలో అతని అవుట్ రేటు 29 శాతం మాత్రమే ఉండేది.
ఇవి కూడా చదవండి:
Banking Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 7 ప్రధాన బ్యాంకింగ్ రూల్స్
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News