Share News

నకిలీ విత్తనాలను కొనుగోలు చేయవద్దు

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:20 PM

నకిలీ విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దని తాండూర్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ సూచించారు. బుధవారం మండలంలోని రేచిని గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు.

నకిలీ విత్తనాలను కొనుగోలు చేయవద్దు
వెంకటాపూర్‌లోని ఇళ్లలో తనిఖీలు చేస్తున్న పోలీసులు

తాండూర్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌

తాండూర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దని తాండూర్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ సూచించారు. బుధవారం మండలంలోని రేచిని గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట సీజన్‌ ప్రారంభం కాకముందే కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గ్రామాల్లో ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని వాటిని రైతులు కొనుగోలు చేయవద్దన్నారు. నకిలీ పత్తి విత్తనాలు వాడితే రైతులు నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం ఆమోదం పొందిన లైసెన్స్‌ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, కొన్న వాటికి రశీదులు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, రైతులు పాల్గొన్నారు.

కన్నెపల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని కన్నెపల్లి పోలీసులు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో నకిలీ విత్తనాలు విక్రయించే పాత నేరస్తులైన పున్నపురెడ్డి చందు, పుట్ట అశోక్‌ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:20 PM