మెరుగైన విద్యను అందించండి
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:58 PM
వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా సూచించారు.

- ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా
ఆసిఫాబాద్‌రూరల్/రెబ్బెన ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా సూచించారు. ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాల(బాలుర) గోలేటి, ఆశ్ర మ పాఠశాల(బాలుర)ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందిం చాలని సూచించారు. సబ్జెక్టుల వారీగా అర్థమయ్యే రితీలో విద్యాబోధన చేయాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి రోజు వంట గది, స్టోర్ రూం, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాల(బాలుర) గోలేటిలో తాగునీటి ప్లాంట్లు పనిచేయక పోవటం, మెనూ పాటించకపోవటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విద్యార్థులకు అల్పాహారంలో స్నాక్స్, మజ్జిగ అందించలేదని విద్యార్థులు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో వార్డెన్ రవీందర్‌కు షోకాజ్ నోటీసును అందజే శారు. ఎలాంటి అనుమతులు లేకుండా విధు లకు గైర్హాజరైన రాజేశ్వర్ అనే ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.