Bandi Sanjay: కాంగ్రెస్-బీఆర్‌ఎస్ బంధం బహిర్గతం
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:55 AM
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్‌ను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయని.. దీంతో ఆ పార్టీల ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

మజ్లిస్‌ను గెలిపించేందుకే ఎమ్మెల్సీ పోటీకి దూరం
బీఆర్‌ఎస్ అవినీతిపై దర్యాప్తు ఏమైంది? : సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లి్‌సను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయని.. దీంతో ఆ పార్టీల ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఇన్నాళ్లు తాము చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని అన్నారు. పార్లమెంటులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాయని సంజయ్ తెలిపారు. డీలిమిటేషన్ పేరుతో మొన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని.. త్వరలోనే తెలంగాణలో ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహించబోతున్నాయని పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నాయకులంతా అసెంబ్లీ ఎన్నికల ముందు కోడై కూశారు.
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, ధరణి పోర్టల్‌లో రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫార్ములా-ఈ రేసులో కేటీఆర్ అవినీతి చేశారని ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు.. తీరా గెలిచాక డబ్బు సంచులకు అమ్ముడుపోయి బీఆర్‌ఎ్‌సతో కుమ్కక్కై అవినీతి కేసులన్నీ నీరుగారుస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..? ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించడం వల్ల గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాల్సిన 30 చోట్ల మజ్లిస్ పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు బీసీ జాబితా ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీరని అన్యాయం జరగబోతోంది. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్‌ను మజ్లిస్ చేతుల్లో పెట్టడానికి సిద్ధమయ్యాయి’’ అని సంజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News