Share News

ఎస్టీపీపీలో రక్తదాన శిబిరం

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:48 PM

భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం ఎస్టీపీపీలోని బ్యాచిలర్‌ ట్రైనీ హాస్టల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి ప్రారంభించారు.

ఎస్టీపీపీలో రక్తదాన శిబిరం
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి

జైపూర్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం ఎస్టీపీపీలోని బ్యాచిలర్‌ ట్రైనీ హాస్టల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పేర్కొన్నారు. ఈ శిబిరంలో 95 మంది రక్తదానం చేశారని తెలిపారు. సేకరించిన రక్తాన్ని గర్భిణీలు, తలసేమియా సికిల్‌ సెల్‌ వ్యాధి గ్రస్తులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ అధికారులు కె. శ్రీనివాసులు, జేఎన్‌ సింగ్‌, మదన్‌ మోహన్‌, సముద్రాల శ్రీనివాస్‌, పంతుల నాయక్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీందర్‌,డాక్టర్‌ లోక్‌నాధ్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 11:48 PM