Mynampalli: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, Publish Date - Mar 18 , 2025 | 11:01 AM
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అలాగే ప్రభుత్వం చేసే పనులకు అడ్గం పడుతున్నారని మైనంపల్లి వ్యాఖ్యానించారు.

- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్‌ఎస్
- మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
హైదరాబాద్: మచ్చబొల్లారం డివిజన్ డంపింగ్ యార్డ్ విషయంలో కాలనీవాసులను బీఆర్‌ఎస్ నాయకులు తప్పుదోవపట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampalli Hanumanta Rao) అన్నారు. సోమవారం అల్వాల్‌ల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డంపింగ్ యార్డ్ కారణంగా ఉత్పన్నమవుతున్న ఇబ్బందులను కాలనీవాసులు తనకు చెప్పిన వెంటనే జోనల్ కమిషనర్ అపూర్వ్‌చౌహాన్, అల్వాల్ డీసీ శ్రీనివాసరెడ్డికి వివరించానని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: ఒకే పనికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ శంకుస్థాపన..
తాను ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నాని ధర్నాలు చేయవద్దని, అలా చేస్తే రాంగ్ మెసేజ్ పోతుందని కాలనీవాసులకు చెప్పారు. అయితే ఆదివారం ధర్నా చేసి, సీఎం డౌన్‌డౌన్ అని కాలనీవాళ్లతో బీఆర్‌ఎస్ నాయకులు అనిపియడం మంచి పద్ధతి కాదన్నారు. కావాలనే బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను మిస్‌గైడ్ చేస్తున్నారని హనుమంతరావు విమర్శించారు.
బీఆర్‌ఎస్(BRS) శ్రేణులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఉరుకోవని, తమ సత్తా చూపిస్తామని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌజ్‌కు పోవడానికి రోడ్లు అభివృద్ది చేసుకున్నారని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
టికెట్ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు
ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News and National News
Updated Date - Mar 18 , 2025 | 11:01 AM